ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందా? అంటే కొన్ని దేశాల్లో పరిస్థితి చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.. ఇక, భారత్‌లోనూ క్రమంగా రోజువారి కేసుల జాబితా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.. ఇదే సమయంలో మహమ్మారిపై విజయం సాధించడానికి తలపెట్టిన వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తూనే ఉంది సర్కార్.. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్.. ఆ తర్వాత బూస్టర్ డోస్ పంపిణీ జరగుతుండగా.. మరోవైపు.. చిన్నారులకు వ్యాక్సినేషన్‌పై కూడా ఫోకస్ పెట్టింది సర్కార్.. అందులో భాగంగా.. 6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు టీకా ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.. ఆ ఏజ్ గ్రూప్ చిన్నారులకు భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతిచ్చింది డీసీజీఐ. అయితే, 12 ఏళ్లు పైబడిన పిల్లల కోసం ప్రస్తుతం భారత్‌లో రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. 12 నుంచి 14 ఏళ్ల వారికి బయోలాజికల్-ఈ తయారు చేసిన కార్బెవాక్స్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండగా.. మరోవైపు 15 నుంచి 18 ఏళ్ల వారికి కొవాగ్జిన్ టీకా ఇస్తున్న విషయం తెలిసిందే.
Read Also: Kiran Bedi: కిరణ్ బేడీకి ఆశ్రమం బాధ్యతలు.. కమిటీ ఏర్పాటు