తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతర ముగిసింది.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు.. ఇక, భక్తుల నుంచి పూజలందుకున్న గిరిజన దేవతలు వనప్రవేశం చేయడంతో.. మహా జాతర ముగిసింది.. సంప్రదాయం ప్రకారం పూజలు చేసిన అనంతరం అమ్మవార్లకు వీడ్కోలు పలికారు గిరిజన పూజారాలు.. సమ్మక్క, సారలమ్మ వనప్రవేశంతో మహా జాతర ముగిసిపోయింది.. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వనదేవతలను సాగనంపారు.. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నేపల్లికి సారలమ్మను చేర్చారు.. పూనుగొండ్లకు సమ్మక్క భర్త […]
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. తెలంగాణతో పాటు ఏపీలోనూ నాలుగు వందలకు చేరువయ్యాయి రోజువారి పాజిటివ్ కేసులు.. ఏపీలో గత 24 గంటల్లో 19,769 శాంపిల్స్ పరీక్షించగా.. 425 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,486 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,15,950కి చేరుకోగా.. రికవరీ కేసులు 22,93,882కు చేరాయి.. ఇక, ఇప్పటి వరకు 14,710 […]
మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. వనదేవతలను దర్శించుకున్న ఆమె.. గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.. ఇక, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందన్నారు.. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి ఈ అతి గొప్ప ఆదివాసీ జాతర ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు.. తెలంగాణ ప్రజలంతా […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గుడ్‌బై చెప్పడం దాదాపు ఖరారు అయినట్టే కనిపిస్తోంది.. సీనియర్లు చెప్పడంతో 3-4 రోజులు ఆగానని.. ఆగినంత మాత్రన వెనక్కి తగ్గేదిలేదని రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.. ఏ పార్టీలో చేరను.. స్వతంత్రంగానే ఉంటా.. రాజకీయా పార్టీ కూడా పెడతానంటూ ప్రకటించారు జగ్గారెడ్డి… అయితే, ఇప్పటికే చాలా మంది రంగంలోకి దిగిన జగ్గారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి […]
తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది… ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. యూపీ ఓటర్లను బెదిరిస్తూ ఓ వీడియో విడుదల చేయడంపై ఇప్పటికే స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని.. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే, ఇప్పటికీ రాజాసింగ్ నుంచి వివరణ రాకపోవడంతపై ఈసీ సీరియస్‌గా స్పందించింది.. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై ఎఫ్ఐఆర్ […]
సినిమా టికెట్లతో పాటు.. సినీ పరిశ్రమకు చెందిన ఇతర సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు గత కొన్ని నెలలుగా కొనసాగగా.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముందుండి పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సినీ పరిశ్రమ తరపున ముందుడి.. ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు.. ఇక, సీఎం జగన్‌తో ప్రత్యేకంగా సమావేశమైన చర్చించారు.. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు కూడా వెళ్లి సమస్యల […]
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు.. దేశం బాగుపడాలంటే.. బీజేపీని గద్దె దింపాలని.. దేశం నుంచి తరిమివేయాలంటూ పిలుపునిచ్చిన ఆయన.. మిమ్మల్ని గద్దె దింపుతాం.. మాకు కావాల్సిన వాళ్లను తెచ్చుకుంటాం అని హెచ్చరించిన విషయం తెలిసిందే.. ఇక, బీజేపీయేతర శక్తులకు కూడగట్టే పనిలో పడిపోయారు కేసీఆర్.. అందులో భాగంగా రేపు ముంబై వెళ్లనున్నారు.. ఇటీవల కేసీఆర్‌కు ఫోన్ చేసి లంచ్‌కు రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే […]
కేవలం మూడు వందల రుపాయలు ముగ్గురిని జైలు పాలు చేసింది.. రూ. 300 అంటే.. ఏ చిల్లర దొంగలో అనుకోకండా… ఎందుకంటే.. నిందితుల్లో ఒకరు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కాగా మరొకరు ప్రైవేట్ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.. ఇంకొకరు మంచి కాలేజీలో చదువుకుంటున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ జూబ్లీబస్టాండ్ వద్ద రాత్రి సమయంలో లిఫ్ట్ కోసం విశాక్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎదురుచూస్తున్నాడు.. అదే సమయంలో అటుగా కారులో వచ్చిన ముగ్గురు.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు.. […]
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం పక్కా… వెనక్కి తగ్గేదేలేదని కుండబద్దలు కొట్టేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి… కాంగ్రెస్ అధిష్టానికి లేఖ రాసిన ఆయన.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా, కానీ, 3-4 రోజులు టైం తీసుకొని ఆలోచించుకోమని సీనియర్లు చెప్పారు.. అందుకే ఆగానని.. సమయం తీసుకున్నా రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదన్నారు.. ఎవరికీ భయపడేది లేదు, ఎవరికీ […]