మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కీరణ్ బేడీకి ఓ ఆశ్రమ బాధ్యతలు అప్పగించింది ఢిల్లీ హైకోర్టు.. రోహిణిలోని బాబా వీరేంద్ర దీక్షిత్ ఆధ్యాత్మిక ఆశ్రమం బాధ్యతలను ఆమెకు అప్పగించింది.. ఆ ఆశ్రమంలో ఉన్న మహిళల ఆరోగ్య, మానసిక, సంక్షేమ పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.. ఆ కమిటీకి కిరణ్ బేడీ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో రోహిణీ జిల్లా మేజిస్ట్రేట్, ఢిల్లీ మహిళా నేర విభాగం డీసీపీ, ఢిల్లీ మహిళా కమిషన్, జిల్లా న్యాయ సేవల విభాగం కార్యదర్శిలను సభ్యులుగా నియమించింది హైకోర్టు.. త్వరలో ఆశ్రమాన్ని సందర్శించి హైకోర్టుకు నివేదిక ఇవ్వనుంది కిరణ్ బేడీ నేతృత్వంలోని కమిటీ. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను మే 27వ తేదీకి వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు.
Read Also: Puvvada Ajay: రేవంత్‌కు పువ్వాడ కౌంటర్.. నువ్వా నా గురించి మాట్లాడేది..?
పరారీలో ఉన్న స్వయం ప్రకటిత దైవం వీరేంద్ర దేవ్ దీక్షిత్ పై ఆరోపణలు వచ్చాయి.. రోహిణిలోని ఆధ్యాత్మిక ఆశ్రమం ముసుగులో తమను అక్రమంగా నిర్బంధించారంటూ 100 మందికి పైగా బాలికల ఆవేదనపై ఆందోళన వ్యక్తం చేసింది హైకోర్టు.. విద్యాసంస్థ ప్రాంగణంలో నివసిస్తున్న బాలికలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడానికి లేదా వారి కుటుంబాలను కలవడానికి అనుమతించడం లేదని ఆరోపిస్తూ ఫౌండేషన్ ఆఫ్ సోషల్ ఎంపవర్‌మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.