ఎన్నో రకాల జంతువులను పెంచుకున్నా.. కుక్కకున్న విశ్వాసం ఏ జంతువుకు కూడా ఉండదని ఎన్నో ఘటనలు ఇప్పటికే రుజువు చేశాయి.. తన యజమానికి ఆపద వచ్చింది అంటే.. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటం చేస్తోంది.. ఇలాంటి ఘటన మరోసారి వెలుగు చూసింది.. తన యజమానికి కోసం ఏకంగా సింహంతో ఫైట్ చేసింది.. యజమాని ప్రాణాలను కాపాడింది..
Read Also: Minister Roja: చంద్రబాబు, లోకేష్‌కు 70ఎంఎంలో సినిమా గ్యారంటీ
ఆ డేరింగ్ డాగ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాలిపోర్నియాలోని ట్రినిటీ నదికి సమీపంలో ఎరిన్ విల్సన్ అనే మహిళ.. పెంపుడు కుక్క ఎవాను వెంటబెట్టుకుని ట్రెక్కింగ్‌కి వెళ్లారు.. అయితే, ఆ సమయంలో ఓ సింహం ఆమెపై దాడి చేసింది.. భయంతో వణికిపోయిన ఆ మహిళ.. వెంటనే తన పెంపుడు కుక్కను పిలిచింది.. దీంతో, తన యజమానిపై దాడి చేస్తున్న సింహాన్ని చూసిన ఆ కుక్క.. ఆమెను రక్షించడం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది.. సింహంతో పోరాటం చేసి తన యజమానిని కాపాడింది.. అయితే, సింహంతో జరిగిన ఫైటింగ్‌లో ఎవాకు తీవ్ర గాయాలయ్యాయి.. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆ పెంపుడు కుక్కకు చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై స్పందించిన ఎరిన్ విల్సన్.. ‘ఎవా నా పట్ల విధేయంగా ఉందో అర్థమవుతోంది.. సింహం దాడితో నేను ఇక ప్రాణాలతో బయటపడడం కష్టం అనుకున్నానని తెలిపారు. మొత్తంగా ఈ డేరింగ్ డాగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు..