Viral: సెకండ్ హ్యాండ్‌లో సైకిల్ కొన్న నాన్న.. మురిసిపోయిన కుమారుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంట్లో కొత్తగా ఏదైనా కొన్నారంటే ముందుగా మురిసిపోయేది చిన్నారులే.. సైకిల్, బైక్, టీవీ, కారు, బంగ్లా.. ఇలా ఎవరి స్థాయిలో వారు కొనుగోలు చేయొచ్చు.. దానిని ఆస్వాధించేది మాత్రం పిల్లలే.. ఇక, మారం చేసి నాకు అది కావాలంటూ పట్టుబట్టి ఇప్పించేవరకు విడవని పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ఓ చిన్నోడు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు.. ఎందుకంటే.. వాళ్ల నాన్న సెకండ్ హ్యాండ్‌లో సైకిల్ కొన్నాడు.. ఇక, సైకిల్‌కు ఓ దండ వేసి పూజ చేస్తున్నాడు.. ఇది చూసిన అతడి కుమారుడి ఆనందానికి అవదులే లేవు.. ఆనందంతో తెగ గెత్తేస్తున్నాడు.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది..
Read Also: KCR: దేశంలో సెన్సేషన్ జరగాలి…. జరుగుతుంది… మీరే చూస్తారు
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
సదరు వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్టు చేశారు ఐఏఎస్ ఆఫీసర్ అవనీశ్ శరణ్.. ఆ వీడియోలో తండ్రి సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేసిన సైకిల్‌కు పూజ చేస్తున్నాడు.. తండ్రికి ఎదురుగా ఉన్న అతడి కుమారుడు చప్పట్లు కొడుతూ ఆనందంగా గంతులేస్తున్నాడు.. ఆనందానికి అవధులే లేకుండా తెగ సంబరపడిపోతున్నాడు.. ఇక, తన కుమారుడి ఆనందాన్ని చూసి.. ఆ తండ్రి కూడా మురిసిపోతున్నాడు.. ఇద్దరూ కలిసి ఆ సైకిల్‌కి దండం కూడా పెట్టుకున్నారు.. “ఇది కేవలం సెకండ్ హ్యాండ్ సైకిల్.. వారి ముఖాల్లో ఆనందం చూడండి.. వారు కొత్త మెర్సిడెస్ బెంజ్‌ను కొనుగోలు చేసినంత సంతోషపడుతున్నారు.’అని కామెంట్ రాస్తూ.. ట్విట్టర్‌లో ఆ వీడియోను షేర్ చేశారు అవనీశ్ శరణ్.. ఇక, ఆ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.. వ్యూస్, రీ ట్వీట్స్, కామెంట్లు ఇలా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
It’s just a second-hand bicycle. Look at the joy on their faces. Their expression says, they have bought a New Mercedes Benz.❤️ pic.twitter.com/e6PUVjLLZW
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) May 21, 2022
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!