తిరుమలలో స్వామి వారికి నిత్యం జరిగే కార్యక్రమాలను నిలిపేశారు.. దీంతో, హిందూ మనోభావాలను కించ పరుస్తున్నారు.. వేంకటేశ్వర స్వామి భక్తుల హృదయాలు గాయపడుతున్నాయని మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. నెల్లూరులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయన్నారు. కర్నూల్ జిల్లా ఆత్మకూరు, శ్రీశైలంలో, కాకినాడ జేఎన్టీయూలో, ఎమ్మెల్యే ద్వారంపూడి సహకారంతో మసీదు నిర్మాణం లాంటి పరిణామాలు చూస్తే ప్రభుత్వ తీరు అర్థం అవుతుందన్నారు.
Read Also: Bank New Rules: నేటి నుంచి కొత్త రూల్స్.. తప్పదు మరి..!
ఇక, యువతకు ఉద్యోగాలు ఇస్తామని జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.. కానీ, పోలీసులతో పాటు ఏ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు సోము వీర్రాజు.. మాటలతో ప్రభుత్వం మభ్య పెడుతోందన్న ఆయన.. కేవలం సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి… వారిని కూడా పర్మినెంట్ చేయకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. రాష్ట్రంలో మహిళలలై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి, మిల్లర్లు, దళారులు కలిసి రైతులను దోచుకుంటున్నారు.. ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం జరుగుతోంది.. రేషన్ బియ్యం రీ సైక్లింగ్ జరుగుతోంది.. రైతులు, ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కుంభకోణాలను వెలుగులోకి తీసుకొస్తామని హెచ్చరించారు సోము వీర్రాజు.