Raja Singh: ఆర్జీవీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన రాజా సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్… ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముని ఉద్దేశిస్తూ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది… బీజేపీ సహా ఎన్డీఏ పక్షాలు ఆర్జీవీని టార్గెట్ చేశాయి.. పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేస్తున్నాయి.. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. రామ్ గోపాల్ వర్మ పనికి మాలిన వ్యక్తి.. అయన తాగి ట్వీట్స్ చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.. ఇక, వార్తల్లో ఉండేందుకు వర్మ ప్రయత్నాలు చేస్తుంటాడు అని దుయ్యబట్టిన ఆయన.. ద్రౌపది ముర్ముపై వర్మ ట్వీట్ ను ఖండించారు.. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికకానున్న సమయంలో వర్మ ట్వీట్ బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు రాజాసింగ్.
Read Also: KTR: సీఎంతో చర్చిస్తా.. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా
Also Read
ఇక, వివాదాలతో తరచూ వార్తల్లో ఉండే రాంగోపాల్ వర్మ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు భారతీయ జనతా పార్టీ నేతలు.. వర్మపై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కించపరిచే విదంగా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు బీజేపీ నేతలు.. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్ పోలీసులను కోరారు బీజేపీ నేతలు గూడూరు నారాయణరెడ్డి , మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్.. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!