అందరి చూపు ఇప్పుడు హైదరాబాద్ పైనే ఉంది.. భారతీయ జనతా పార్టీ బడా నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.. కాసేపట్లో హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, కీలక నేతలు నగరానికి చేరుకుంటున్నారు.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా.. తదితరులు రానుండా.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు.. రెండు రోజుల పాటు సిటీలో ఉండనున్న ప్రధాని మోడీ.. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న భారీ బహిరంగసభలో ఉపన్యాసం చేయనున్నారు.. ఇక, బీజేపీ కాషాయ సంబరాలకు సంబంధించిన అప్‌డేట్లు ఎప్పటికప్పుడు మీకోసం..
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఆదివారం సాయంత్రం జరగనున్న బీజేపీ విజయ సంకల్ప సభకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారీ జనసమీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే నాంది పలకాలని, బీజేపీ సత్తా చాటాలని భావిస్తున్నారు.వివిధ జిల్లాల నుంచి భారీగా జనం రానున్నారు. ప్రధాని మోడీ ఎక్కువ సేపు సభలోనే వుండనున్నారు. దీంతో అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తొలి రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం రాత్రి 8.30కు ముగిసింది. రాత్రి 9.30 వరకు వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలు రాత్రి నోవాటెల్‌లో బస చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెటల్ చుట్టూ భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చేపట్టారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానం ఆమోదం పొందింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు చర్చించారు
హైదరాబాద్ లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది. సమావేశం మధ్యలో మోడీ అమిత్ షా నడ్డాలతో ప్రత్యేకంగా కూర్చున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయంటూ రాష్ట్ర నాయకులను కొనియాడారు మోడీ. NEC సందర్భంగా హైదరాబాదులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి కూడా చర్చించినట్టు తెలుస్తోంది.
టి.బీజేపీ నేతలతో మోడీ
రేపు ఉదయం 6 గంటలకు పాత బస్తీ లోని భాగ్యలక్ష్మి దేవాలయానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ వెళ్లనున్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేకపూజల్లో యోగి పాల్గొంటారు. యోగితో పాటు ఓల్డ్ సిటీ కి బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ వెళతారు.
ఆర్థిక తీర్మానం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రవేశ పెట్టగా, దానిపై మాట్లాడారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. పియుష్ గోయల్, మనోహర్ లాల్ కట్టర్ లు బలపరుస్తూ మాట్లాడారు. ఆర్ధిక అంశాలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీర్మాణం ప్రవేశపెట్టారు. పియుష్ గోయల్ ,మనోహర్ లాల్ కట్టర్ లు ఆ తీర్మానాన్ని బలపరిచారు. కోవిడ్ సమయంలో ప్రపంచ దేశాలు తలకిందులైన సమయంలో భారత ప్రభుత్వము మోడీ నాయకత్వంలో చేపట్టిన చర్యలు అభినందనీయం. పేద వర్గాలను దారిద్ర్య రేఖ బయటకు తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. జన్ ధన్ యోజన, గరీబ్ కల్యాణ్, ముద్ర రుణాలు వంటి పథకాలు సత్ఫలితాలు ఇచ్చాయి. దేశం రెండంకెల వృద్ది దిశగా వెళ్తోంది. మోడీ నాయకత్వంలో గడిచిన 8సంల కాలంలో సాధించిన పురోగతిని NEC అభినందిస్తూ... ప్రధానికి కృతజ్ఞతలు తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు వాగిండు, ఓర్రిండు. కెసిఆర్ ని ఎవ్వడు పట్టించుకోవడం లేదు. ఇక్కడ మైనర్ అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు mim, trs నేతలు చేస్తున్నారు. కెసిఆర్ విచ్చల విడి తనం ఎక్కువ అవుతుంది. డ్రగ్ మాఫియా , భూ దందా, మైనింగ్ మాఫియా ఇక్కడే వున్నాయన్నారు. ఒక ఆఫీసర్ చెప్పాడు డ్రగ్ కేసును సీరియస్ గా తీసుకోవాలని అన్నాడు అట... 10 రోజుల తరవాత నీకేమి పని లేదా అన్నాడు అంట. డ్రగ్ కేసులో నీ చుట్టపు వాళ్లు ఉన్నారా?రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా దేశః లో ఎక్కడైనా ఫ్లెక్సీ లు కట్టారా...పబ్లిక్ ఓటేస్తే గెలిచే ఎన్నికలా... రాష్ట్రపతి ఎన్నికల వ్యవస్థను కించ పరిచి దిగ జార్చావు. నీ ఓటింగ్ పర్సెంట్ తగ్గింది మాది పెరుగుతుందన్నారు బండి సంజయ్.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. ఈ సమావేశాలు నడ్డా ప్రసంగంతో ప్రారంభం కాగా, రేపు మోడీ ప్రసంగంతో ముగుస్తాయి. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై తీర్మానాలు ఆమోదించనున్నారు. ఆర్థిక అంశాలకు సంబంధించి పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపుపై చర్చిస్తారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కలిగిస్తే కేంద్రం చేసిన పనులు.. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం , వేగంగా అభివృద్ధికి తోడ్పాటు అందించే అంశాలపై కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. దేశంలోని కుటుంబ, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయ తీర్మానం తీసుకురానున్నారు. తెలంగాణలో కుటుంబ రాజకీయాలను మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ కుటుంబ రాజకీయాలు దేశాన్ని ఎలా అథోగతి పాలు చేస్తున్నాయో తీర్మానంలో చర్చిస్తారు.
రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు కేసీఆర్ అని మండిపడ్డారు బీజేపీ నేత స్మృతి ఇరానీ. ప్రధాని తెలంగాణ వస్తే కేసీఆర్ ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. కేసీఆర్ విధానాలకు దేశం ఎప్పుడు ఆమోదించదు. కేసీఆర్ కు ఆయన మనుషులకు రాజకీయాలంటే సర్కస్ అయ్యాయి. అవినీతి కుటుంబ పాలనకు మారో పేరు టీఆర్ఎస్. కుటుంబ పాలన ను దేశం ఎప్పుడు ఆమోదించదు. టీఆర్ఎస్ చేస్తుంది మేము చేయం. వారసత్వ రాజకీయాలను మేము ఫాలో కాబోమన్నారు స్మృతి ఇరానీ.గొల్లకొండలో ఆమె ఎగ్జిబిషన్ సందర్శించారు.
NEC సమావేశంలో స్వతంత్ర ఉద్యమ త్యాగ ధనులకు శ్రద్ధాంజలి ఘటించారు. పేద, వెనుకబడిన వర్గాల అభివృద్ది కోసం మోడీ నాయకత్వంలో గత 8సంలలో చేసినా కృషిని ప్రశంసించారు.పేదల అభివృద్ది కోసం రుపొందించిన పథకాలను అభినందించారు.శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్వప్నమైన ఆర్టికల్ 370 రద్దు ను ప్రశంసించారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ నినాదాన్ని సాకారం చేసేందుకు జనదన్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి వంటి సామాజిక భద్రత, sc, st వర్గాల ఉన్నతికి చేపట్టిన స్కీమ్స్ ను ప్రస్తుతించారు నడ్డా.
Covid సమయంలొ ప్రతి ప్రాంతంలో సేవ చేసిన కార్యకర్తలకు అభినందలు తెలిపారు. 25నెలలు పాటు 80కోట్ల ప్రజలకు ఉచిత ఆహార భద్రత అందించిన నిర్ణయాన్ని అభినందించారు.వాక్సినేషన్ లో ప్రపంచ పటంలో భారత్ ను అగ్ర భాగాన నిలిపిన ఘనతను తెలిపారు.రాష్ట్రపతి అభ్యర్ధి గా ఆదివాసీ దళిత శ్రీమతి ద్రౌపదీ ముర్మును ప్రకటించడం బలహీన వర్గాల పట్ల మా ప్రాధాన్యతను చాటిందన్నారు. ప్రధాని పేదల అభివృద్ది కోసం చేపట్టిన కార్యక్రమాలు ప్రతి కార్యకర్తకు ఆదర్శం అన్నారు.గోవా, మణిపూర్ , యూపీ రాష్ట్రాలలో పార్టీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు అభినందించారు.బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న మా కార్యకర్తలకు, కాశ్మీర్ వేర్పాటు వాదుల చేతిలో అంతమైన కార్యకర్త ల త్యాగాలను స్మరించుకున్నారు.దేశాన్ని తప్పుదోవ పట్టించే విపక్షాల ప్రయత్నాలపై విచారం వ్యక్తం చేసారు జేపీ నడ్డా.
స్ఫూర్తితో కూడిన సహకార సమాఖ్య మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఉద్దేశపూర్వకంగా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన తెలంగాణ సిఎం.... సిఎం మరియు పిఎం పదవులను అవమానించారు. కేసీఆర్ దాక్కోవచ్చు కానీ ఆయన అవినీతి రాజకీయాలు మాత్రం దాగి ఉండవు
మోడీ హయాంలో పెరిగిన ధరల్ని ఎలా నియంత్రించాం. పెట్రోల్ ధరల్ని తగ్గించేందుకు ఏం చేశామనేది బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో వివరించనున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణకు ఏం చేయబోతున్నామనేది సమావేశంలో వెల్లడించనున్నారు. రేపు సాయంత్రం జరిగే బహిరంగ సభపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులు పాల్గొన్నారు. వివిధ తీర్మానాలను ఇప్పటికే రూపొందించారు. బీజేపీ కీలక నేతలకు తెలంగాణ బీజేపీ నేతలు శాలువా కప్పి స్వాగతం పలికారు. రాబోయే కాలానికి సంబంధించి బీజేపీ ఈ సమావేశాలను కీలకంగా భావిస్తున్నారు.
బీజేపీని 2024 ఎన్నికలకు సిద్ధం అవుతోంది. 18 ఏళ్ళ తర్వాత బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈసమావేశాలకు భారీ ఏర్పాట్లు చేసింది బీజేపీ. జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాల్లో పాల్గొన్నారు ప్రధాని మోడీ. ప్రధాని పక్కనే జేపీ నడ్డా ఆసీనులయ్యారు.
మెట్రో పిల్లర్లకు ఉన్న కేసీఆర్ ప్లెక్సీల పై,నరేంద్ర మోడీ ప్లెక్సీలను అతికించారు బీజేపీ కార్యకర్తలు. రేపు నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో విజయ సంకల్ప సభకు సంబంధించిన ఫ్లెక్సీలను గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సూచనతో కార్యకర్తలు దిల్ సుఖ్ నగర్ నుండి చైతన్యపరి వరకు మెట్రో పిల్లలకు ఉన్న కేసీఆర్ ఫ్లెక్సీ పై బిజెపికి సంబంధించిన ప్లెక్సీలను అతికించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు కాషాయ జెండాలు, ఫ్లెక్సీలతో సరికొత్త రంగును పులుముకున్నాయి. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ జెండాలతో నగరం కొత్త రూపు సంతరించుకుంది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను లాంఛనంగా ప్రారంభించారు జేపీ నడ్డా. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. రాత్రి 9 గంటల నుంచి మిగతా సమయమంతా రిజర్వ్‌గా ఉంచారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులతో సమావేశ ప్రాంగణం కోలాహలంగా వుంది.
ప్రధానమంత్రి మోడీ కి వంటి చేసి పెడతానని కలలో కూడా తాను ఊహించలేదు. బండి సంజయ్ మూలంగా నాకు ఈ అవకాశం వచ్చింది. తెలంగాణా రుచులన్నీ మోడీకి వండబోతున్నాను. చాలా ఆనందంగా ఉంది. మొత్తం 25 రకాల వంటకాలను వండబోతున్నా అన్నారు యాదమ్మ. ఎన్టీవీతో ఆమె తన ఆనందం పంచుకున్నారు.
హెచ్ఐసీసీకి క్యూ కడుతున్నారు బీజేపీ కీలక నేతలు. బీజేపీ పదాధికారుల సమావేశం అనంతరం డ్రాఫ్ట్ ముసాయిదా రూపొందించారు. హెచ్ ఐసీసీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బీజేపీ నేతలతో శాతవాహన నగర్ సందడిగా మారింది.
బేగం పేటనుంచి హెచ్ ఐసీసీకి వచ్చిన ప్రధాని నోవాటెల్ లో బస చేశారు. కాసేపట్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. పార్టీకి సంబంధించి వివిధ తీర్మానాలు ఇందులో ప్రవేశపెడతారు. తెలంగాణకు సంబంధించి కీలక మయిన తీర్మానం వుంటుందని భావిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం.. అని ట్వీట్ లో పేర్కొన్నారు.
మోడీ ట్వీట్
ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ బేగం పేట విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గవర్నర్ తమిళిసై స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రధాని హెచ్ ఐసీసీకి చేరుకున్నారు. బేగం పేట ఎస్పీజీ అధీనంలో వుంది. హెచ్ ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు.
ప్రతి బూత్ లో 200 మంది కార్యకర్తలు తయారు చేయాలని సూచించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధర రాజే సింథియా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పన్నా ప్రముఖ్ ల పై చర్చ ఉంటుంది.. బూత్ శశక్తి అభియాన్ పై ప్రతి 15 రోజుల కోసారి రాష్ట్ర అధ్యక్షుడు రివ్యూ చేయాలి, హర్ ఘర్ తిరంగ పేరుతో పెద్ద కార్యక్రమం నిర్వహించాలి.. 20 కోట్ల మందికి చేరాలని సూచించారు. ఇక, 30 కోట్ల కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులు ఉన్నారు... వారందరి ను కలిసే కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు వసుంధర రాజే.
హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ఉత్తప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మోరియా దర్శించుకున్నారు. మాట్లాడుతూ.. తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే హైదరాబాద్ పేరు మారుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రేపు బీజేపీ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు రానున్నారు.. ఆ తర్వాత స్పెషల్ హెలికాప్టర్‌లో బేగంపేట్ నుంచి హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు.. అయితే, ప్రధాని పర్యటన దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.. వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గంలో హెచ్‌ఐసీసీకి ప్రధాని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. అందులో భాగంగా.. మోడీ కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు.
నగరంలో.. టీఆర్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ జాతీయ మహాసభ నేపథ్యంలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, నిర్వహించబోయే ర్యాలీలకు పోటీగా టీఆర్ఎస్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ర్యాలీలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకపోయినా పర్వాలేదు.. టీఆర్ఎస్ ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ శ్రేణులు కావాలనే పనిగట్టుకొని, ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు.. ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లే దారుల్లోనే ప్లెక్సీలు ఏర్పాటు చేసి రెచ్చగొడుతున్నారని ఆగ్రమం వ్యక్తం చేసారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారి రేపు (ఆదివారం) దర్శించుకుంటారని ఎమ్మెల్యే రాజసింగ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని రాజసింగ్ పిలుపునిచ్చారు. అయితే.. మొదట కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న తర్వాతనే బయట కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. భాగ్యలక్ష్మి అమ్మవారిని రేపు యోగి దర్శించుకుంటారని, యోగి రాక కోసం పాతబస్తీ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు.
ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ఆయన.. అక్కడ నుంచి ప్రత్యేక హెలిక్టాపర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 3.20 గంటలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతోన్న హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు.. సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొంటారు.. రాత్రి నోవాటెల్‌లో బస చేయనున్నారు ప్రధాని మోడీ.
ప్రధాని, కేంద్ర హోంమంత్రి రాకతో హెచ్‌ఐసీసీ ఎంట్రన్స్ వద్ద హైఅలర్ట్. అప్రమత్తమైన పోలీసులు వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రుల పర్యటనతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఆఫీస్ బేరర్స్ సమావేశం జరుగుతోంది.. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఎజెండా తీర్మానాలనుపై చర్చించి... ముసాయిదా తీర్మానాలను ఫైనల్ చేసే పనిలో పడిపోయారు.