Deputy CM Pawan Kalyan: ప్రతి ప్రభుత్వ కాలేజీకి పూర్వ విద్యార్థుల నుంచి సహకారం అందితే ఆ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఉండది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రంగరాయ మెడికల్ కాలేజ్ దేశానికి అనేక మంది ఉత్తమ వైద్యులను అందించిందని, ఈ కాలేజ్ అందరికీ ఇన్స్పిరేషన్గా […]
Amaravati Avakaya Utsav: విజయవాడలోని పున్నమి ఘాట్‌లో రెండో రోజు ఆవకాయ అమరావతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సినిమా, సంస్కృతి, సాహిత్యాల సమ్మేళనంగా కొనసాగిన ఈ ఉత్సవాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణానది తీరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవ వాతావరణాన్ని మరింత సొగసుగా మార్చాయి. సంగీతం, నృత్య ప్రదర్శనలతో పాటు సినీ సాహిత్యంపై జరిగిన చర్చలు మంచి స్పందన పొందాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు పున్నమి ఘాట్‌ను కళా, సాంస్కృతిక వేదికగా […]
Off The Record: ప్రతికూల పరిస్థితుల్లో కూడా… తన మెలో డ్రామాతో సానుభూతి సంపాదించుకోవడంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దిట్ట. వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచిన ఆయన.. గత ఎన్నికల సమయంలో టీడీపీలోకి జంప్ కొట్టి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని కోటంరెడ్డికి హామీ ఇచ్చారట. దీంతో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే తనకు మంత్రి పదవి వస్తుందని, జీవితాశయం నెరవేరబోతోందని […]
Off The Record: అనకాపల్లి జిల్లా కూటమి ఎమ్మెల్యేల్లో అసంతృప్తి అగ్నిపర్వతంలా మారుతోంది. అధికారంలోకి వచ్చిన మొదట్లో ఫుల్ జోష్‌గా కనిపించిన శాసనసభ్యుల్లో మెల్లిగా నిర్లిప్తత పెరుగుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. జిల్లాలో తమ మాట చెల్లక…ఆవేదన చెప్పుకునే మార్గం కనిపించక, సీనియర్ ఎమ్మెల్యేలంతా మౌనమే బెటర్ అన్న అభిప్రాయానికి వస్తున్నారట. ఒకప్పుడు జిల్లా అంతటా ఏం జరుగుతోందో ఆరా తీసి పెద్దలుగా పార్టీల పటిష్టానికి తమ సలహాలు ఇచ్చినవాళ్ళు కూడా ఇప్పుడు గిరి గీసుకుని నియోజకవర్గ హద్దు […]
Fake Liquor Case: అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు 33 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు నమోదు చేయగా, వారిలో ఏడుగురు నిందితులకు తంబళ్లపల్లి కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది.. అయితే, ఏడుగురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. కోర్టు బెయిల్ మంజూరు చేసిన నిందితులు.. A6 – మణి మారన్ A7 – ఆనందన్ […]
పిఠాపురం కమిషనర్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. నేను చీపురు పట్టి తుడవాలా..? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు.. అయితే, స్థానిక అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పవన్.. పిఠాపురం మున్సిపల్ కమిషనర్‌తో పాటు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం కమిషనర్ వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, అపరిశుభ్ర పరిస్థితులను చూసి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలు ఇంత చెత్తగా […]
APSRTC Rental Bus Owners Strike Call Off: ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 2,700 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో దూర ప్రాంత సర్వీసులు కాకుండా… స్త్రీశక్తి పథకం అమలవుతున్న పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు 2,419 ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిందని, దీనివల్ల డిజిల్ ఎక్కువగా వినియోగించాల్సి వస్తోందని, టైర్ల అరుగుదల ఎక్కువగా ఉందని, బస్సుల నిర్వహణ […]
Deputy CM Pawan Kalyan: సొంత నియోజకవర్గం పిఠాపురంలో రెండు రోజుల పర్యటనకు వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు.. పిఠాపురంలో కాలనీలలో నడుచుకుంటూ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. ఏళ్ల తరబడి డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కాకపోవడంపై అధికారులను వివరణ అడిగారు.. నియోజకవర్గంలో పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు.. పిఠాపురం కమిషనర్ కనకారావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన […]
Rain Forecast for Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలు చలి పంజాతో గజగజ వణికిపోతున్నాయి.. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం శ్రీలంక సమీపంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. Read Also: Tirumala […]
Tirumala Laddu Ghee Adulteration Case: భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో పెద్ద దుమారమే రేపింది.. అయితే, తిరుమల లడ్డూ-నెయ్యి కల్తీ కేసులో మరో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. మొదటిసారి నెయ్యి కల్తీ చేసిన సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించినందుకు టీటీడీ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి లంచం స్వీకరించినట్లు సిట్ విచారణలో స్వయంగా అంగీకరించారట.. ఇక, ఈ కేసులో A34 కేసు నిందితుడుగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి, ముందస్తు […]