ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా భర్త సెల్వమణి ఓ వివాదంలో చిక్కుకున్నారు.. తమిళ సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తిగా తమిళ సినీ పరిశ్రమ తరఫున ఆయన మాట్లాడడం వివాదానికి కారణమైంది.. ఇతర రాష్ట్రాల్లో షూటింగులు జరగడంతో తమిళనాడు ప్రభుత్వానికి రెవెన్యూ తగ్గుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు తమిళ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిపోయాయి… అయితే, సెల్వమణిపై మండిపడుతోంది తెలుగుదేశం పార్టీ.. సెల్వమణి వ్యాఖ్యలపై మంత్రి రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. Read […]
ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడూస్తూనే ఉంది.. ఓవైపు కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తుంటే.. ఇంకో వైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. పెరిగిన ధరలపై బాదుడే బాదుడు పేరుతో ఉద్యమం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూంది.. అయితే, కుళ్లు, కుతంత్రాలతో టీడీపీపై దుష్ప్రచారం చేస్తూ మాట్లాడడం వల్ల జగన్‌కు, వైసీపీ నేతలకు ఆత్మ సంతృప్తి […]
ఓ కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు, విద్యార్థి విభాగం నాయకుడికి బెయిల్ వచ్చింది.. దీంతో, అతడికి అనుకూలంగా సంబరాలే జరిగాయి… ఏకంగా పోస్టర్లు వెలిశాయి.. అయ్యగారి కీర్తిని చాటుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితుడు బెయిల్ రద్దు చేసింది.. అంతే కాదు వారం రోజుల్లో లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అత్యాచారం కేసులో నిందితుడైన మధ్యప్రదేశ్ యువకుడికి బెయిల్ […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.. జిల్లాల పర్యటనలో భాగంగా.. ఇవాళ తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పర్యటించనున్నారు.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు చంద్రబాబు. ఇక, సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగనుంది.. Read Also: Kedarnath: తెరచుకున్న కేదార్నాథ్.. భక్తుల పులకింత.. చంద్రబాబు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. * అన్నవరంలో ఉదయం 10 గంటలకు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ముఖ్య […]
ప్రముఖ శైవక్షేత్రం కేదార్నాథ్ ఆలయం ఇవాళ తెరుచుకుంది.. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయాన్ని ఇవాళ ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, శివనామ స్మరణమధ్య ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.. దీంతో, భక్తులు తన్మయతంలో పులకించిపోయారు. ఈ పవిత్రోత్సవాన్ని తిలకించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Read Also: Movie Tickets: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయం.. హైకోర్టు గ్రీన్ […]
ఆన్లైన్లో సినిమా టికెట్లను విక్రయించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, దీనికి కొన్ని అడ్డంకులు వచ్చాయి.. దీంతో, ఆన్లైన్ టికెటింగ్ విధానం అమలు చేస్తారా? అనే అనుమానాలు కలిగినా.. ఇప్పుడా ఆ సస్పెన్స్ కు తెరపడినట్టు అయ్యింది.. ప్రభుత్వ సినిమా టికెట్ల విధానానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆన్ లైన్ సినిమా టికెట్ల అంశంపై మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ […]
విద్యాలయాల్లో ర్యాగింగ్ భూతం పంజా విసురుతూనే ఉంది… ర్యాగింగ్‌పై నిషేధం ఉన్నా.. అక్కడక్కడ జరుగుతోన్న ఘటనలు కలవరపెడుతున్నాయి.. తాజాగా, కర్నూలు ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది.. హాస్టల్ క్యాంపస్‌లో బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని నమస్తే పెట్టలేదని ఫైనల్ ఇయర్ విద్యార్థి దాడి చేశారని ఆరోపణలు చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.. అయితే, క్యాంపస్ లో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని స్పష్టం చేస్తున్నారు ట్రిపుల్ ఐఐటీ అధికారులు.. హాస్టల్ దగ్గర ఓ జూనియర్ విద్యార్థినికి, సీనియర్ […]
కరోనా మహమ్మారి మిగిల్చిన విషాదం ఎంతో.. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన కోవిడ్.. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టింది.. వైద్య రంగంలోని లోటును కళ్లకు కట్టింది.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహమ్మారి బారినపడి కోలుకోగా.. దాదాపు కోటిన్నర మంది ప్రాణాలు వదిలారు. కరోనా కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 1.49 కోట్లమంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు విడిచినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్)వో ప్రకటించింది. దేశాలవారీగా వివరాలను కూడా వెల్లడించింది.. భారత్‌లో కోవిడ్ మరణాలు 47 లక్షలని […]
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, వైశాఖమాసం, శుక్లపక్షం, శుక్రవారం రోజు ఏ రాశివారి.. ఎలాంటి ఫలితాలు ఉన్నాయి…? ఏ రాశివారు.. ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది..? ఎవ్వరు తమ పనులు వాయిదా వేసుకోవాలి…? ఎవరు ముందుకు వెళ్లాలి..? ఇలాంటి పూర్తి వివరాలతో కూడిన రాశిఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=S05f8itEpuY
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి… గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత.. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.. కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు కలిగిఉన్న ఆయన.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు.. ఎన్టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. అనేక విషయాలను వెల్లడించారు.. Read Also: Minister Amarnath: చంద్రబాబుకి పిచ్చి హిమాలయాలకు చేరింది వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు ఉత్తమ్.. ఇది […]