తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు , పంటలు దెబ్బతిన్నాయన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ లోని ప్రధాన ఆలయమైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి పరిసరాలు కూడా వర్షపునీటితో దెబ్బతిన్నాయి. ప్రధానాలయ పరిసరాలు, క్యూలైన్లు వర్షం నీటితోపాటు లీకవుతున్న ప్రధానాలయం మండపాలకు మరమత్తులు మొదలు పెట్టారు. ఈ మేరకు ఆలయ అధికారులు వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకొని పనులకు సిద్దమైనారు. సన్నిధిలో ఎక్కడెక్కడ వర్షపు నీరు చేరి మట్టి పేరుకపోయిందో […]
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర నాయకత్వం పై డైరెక్ట్ అటాక్ చేశారు. తాను లోలోపల రగిలిపోతున్న అంశాలన్నింటిపైన ఒక్క సారిగా కుండబద్దు కొట్టినట్టు చెప్పేశారు. వరంగల్ లో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభనే ఇందుకు వేదికగా చేసుకున్నారు ఆయన. సభకు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన పార్టీ అధినాయకుడు రాహుల్‌గాంధీ సమక్షంలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రవర్తిస్తున్న తీరును, పార్టీ సీనియర్లుగా […]
పంజాబ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి తేజేంద్రపాల్ సింగ్ బగ్గా అరెస్ట్, విడుదల నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. బగ్గాను అర్ధరాత్రి గురుగ్రామ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఆయన వీపు, భుజానికి గాయమైందని లాయర్ చెప్పడంతో.. ఆయన విడుదలకు మేజిస్ట్రేట్ అనుమతించారు. దాంతో బగ్గా ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు ఢిల్లీలోని తేజేంద్రపాల్ సింగ్ బగ్గా నివాసంలో ఆయన్ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను జనక్‌పురి పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. […]
ప్రపంచ దేశాలపై కరోనా ప్రభావం అంతా ఇంత కాదు.. వైరస్ సృష్టించిన విలయానికి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాం. అయితే ప్రస్తుతం చోటుచేసుకుంటోన్న వాతావరణ మార్పులు తదుపరి వైరస్‌కి కారణమవుతన్నాయని తాజా అధ్యయనం అంచనా వేసింది. విపరీతంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి తరలి రావడం, దాంతో వైరస్లు జంతువుల నుంచి మానవులకు సోకడంతో మరో మహమ్మారి ముప్పును పెంచుతున్నట్లు నివేదికలో వెల్లడైంది. Read Also: Honour Killing: పరువు హత్యపై ఒవైసీ రియాక్షన్ జంతువులను ఒకేచోట […]
సరూర్ నగర్ పరువు హత్య కేసుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నాగరాజు హత్యను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఆశ్రిన్ సుల్తానా తన ఇష్టపూర్వకంగానే నాగరాజును పెళ్లి చేసుకుందని… అది సరైందేనని ఒవైసీ అన్నారు. సుల్తాన్ సోదరుడు ఆమె భర్తను హత్య చేయడం క్రూరమైన చర్య అని తెలిపారు. రాజ్యాంగం ప్రకారమైనా, ఇస్లాం ప్రకారమైనా… ఇది నేరపూరిత చర్య అన్నారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు […]
వంటింట్లో గ్యాస్ ధర మంట పెడుతోంది… ఇప్పటికే ఆన్‌టైం హై రికార్డులను తాకిన ఎల్పీజీ సిలిండర్ ధర.. మరోసారి పెరిగింది.. వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచేశారు.. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సిలిండర్ ధరల పెంపు సామాన్యుల కష్టాలను మరింత పెంచుతుంది. తాజా పెంపుతో.. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,052కి చేరింది. Read Also: Gold Price: పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన […]
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి… ఒకరోజు పెరిగి షాక్ ఇస్తే.. మరోరోజు తగ్గి గుడ్‌న్యూస్ చెబుతున్నాయి.. ఇక, నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47,100గా ఉంది. నిన్న 47,400 ఉండగా.. ఇవాళ 300రూపాయలు తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,380 రూపాయలు ఉంది. ఇవాళ 320 రూపాయలు తగ్గింది. ఇక, పసిడి దారిలోనే వెండి కూడా ప్రయాణం […]
గ్యాస్ లీకై ఓ ఫైవ్ స్టార్ హోటల్లో భారీ పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతిచెందినట్టుగా తెలుస్తోంది… క్యూబా రాజధాని హవానాలో ఈ ఘటన జరిగింది… సరటోగా పిలిచే అతి పురాతణమైన ఫైవ్స్టార్హోటల్లో ఈ ప్రమాదం జరిగింది.. మరో 50 మందికిపైగా గాయపడినట్టుగా తెలుస్తుండగా.. దాదాపు 13 మంది ఆచూకీ దొరకడం లేదని చెబుతున్నారు.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది రెస్క్యూటీమ్.. ఈ […]
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మాతృమూర్తులకు గొప్ప సదావకాశాన్ని కల్పిస్తోంది. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఈ నెల 8న తల్లులకు ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది. ఐదేండ్లలోపు చిన్నారులతో కలిసి తల్లులు అన్ని బస్సుల్లో ఆదివారం ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అమ్మ అనురాగాన్ని, ప్రేమను వెలకట్టలేమని, ఆ త్యాగమూర్తుల విశిష్ట సేవలను గుర్తుచేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నామని సజ్జనార్ వెల్లడించారు. మదర్స్ డే సందర్భంగా ఆర్డినరీ నుంచి ఏసీ వరకు అన్ని […]
నేడు హన్మకొండ, వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఉదయం 10 గంటలకు వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు శాయంపేట హవేలికి చేరుకుంటారు మంత్రి కేటీఆర్. 10.15 గంటలకు కైటెక్స్ టెక్స్టైల్ పార్కు భూమి పూజ , మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన , యంగ్వన్ ఫొటో డెమో కార్య క్రమం , గణేష్ ఎకోపెట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవం , అనంతరం అధికారులు , ప్రజాప్రతినిధులతో సమావేశం […]