త్వరతోనే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా.. అందులో ఒకటి బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్యకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.. ఇక, ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడంతో ఆ వార్తకు మరింత బలం చేకూరినట్టు అయ్యింది.. ఈ సారి విజయసాయిరెడ్డి, కిల్లి కృపారాణి, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుండగా.. ఇవాళ […]
నెల్లూరు జిల్లాలో బంగారు నిక్షేపాలు, రాగి నిల్వలు గుర్తించారు.. ఉదయగిరి మండలం మాసాయిపేటలో బంగారు నిక్షేపాలు, రాగి నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది… జల్లాలోని ఐదు ప్రాంతాల్లో 46 నమూనాలను సేకరించింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. రెండు వేల హెక్టర్లకు పైగా నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది.. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో డ్రిల్లింగ్ పనులు వేగవంతం చేయనున్నారు.. బంగారు నిక్షేపాలతో పాటు రాగి నిల్వలు 20 నుండి 110 మీటర్లలోపు […]
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో క్రికెట్ స్టేడియం నిర్మించాలనే యోచన రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి లేఖ రాయనున్నట్టు తెలిపారు.. ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ అయితే భవన నిర్మాణాలు ఎక్కడ కడతారు ? అని ప్రశ్నించిన ఆయన.. ల్యాబ్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని సూచించారు. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ను పరిశీలించిన సోము వీర్రాజుకు క్రికెట్ స్టేడియం నిర్మాణం […]
బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య రాజ్యసభ సభలో అడుగుపెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది… ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లాన్‌గా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.. ఇక, ఆర్.కృష్ణయ్య ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.. ప్రస్తుతం బీసీ సంఘాల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆర్. కృష్ణయ్య… గతంలో ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. టీడీపీ ఎమ్మెల్యేగా ప్రతినిథ్యం వహించారు.. ఇప్పుడు ఆర్. […]
బెజవాడలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటా ధర ఏకంగా 70 రూపాయలకు చేరింది. రెండు నెలల క్రితం నగరంలో కేజీ టమాటా 10 రూపాయలు మాత్రమే. ఇప్పుడా ధర వంద రూపాయలకు చేరుకునేలా ఉంది. ఏ కూర వండినా అందులో టమాటా ఉండాల్సిందే. అలాంటి టమాటా ఇప్పుడు కొనాలంటేనే కరువైపోయింది. తుఫాన్‌తో పంట నష్టపోవటమే రేట్లు పెరగటానికి కారణం అంటున్నారు వ్యాపారులు. Read Also: IPS Pratap Reddy: బెంగళూరు సీపీగా ఏపీ సీనియర్ ఐపీఎస్.. మరోవైపు, […]
కర్ణాటక రాజధాని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ సీహెచ్ ప్రతాప్‌రెడ్డి నియమితులయ్యారు.. బెంగళూరు పోలీస్ బాస్‌గా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆయనను సీపీగా నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు.. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రతాప్‌రెడ్డి… గతంలో బెంగళూరు నగర అదనపు కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా ఉన్నారు.. ఇప్పుడు బెంగళూరు పోలీస్ కమిషనర్‌గా […]
రైతుల సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేసి.. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా చేసిన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)లో చీలిక వచ్చింది. ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన రాకేష్ టికాయత్ వైఖరి నచ్చని రైతు నాయకులు కొత్త సంఘం పెట్టుకున్నారు. రాజేష్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో భారతీయ కిసాన్ యూనియన్ అరాజనీతిక్ పేరుతో కొత్త సంఘంగా ఆవిర్భవించింది. రాజకీయాలకు వ్యతిరేకంగా రైతు సంక్షేమం కోసం పోరాటం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు రాజేష్ సింగ్ చౌహాన్. ఢిల్లీ రైతు […]
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, శివగంగై సహా దేశ వ్యాప్తంగా ఏడు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. తనయుడు కార్తీ చిదంబరంపై నమోదైన కేసులకు సంబంధించిన వ్యవహారంలో భాగంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. 2010 నుంచి 2014 మధ్య కాలంలో కార్తీ చిదంబం విదేశాలకు నగదు తరలించారని ఆరోపణలు ఉన్నాయి. కార్తీ చిదంబరం తన తండ్రి పి. చిదంబరం […]
ధరలు పెరిగినా, తగ్గినా.. పసిడికి ఉన్న గిరాకీ మాత్రం తగ్గడంలేదు.. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46,250గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,450గా ఉంది. అటు వెండి ధరలో మాత్రం కొంత పెరుగుదల నమోదైంది. వెండి నిన్నటితో పోలిస్తే తులానికి 8 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం తులం వెండి ధర 645 రూపాయలుగా ఉంది. కాగా, కొద్ది […]