Fake Liquor Case: నకిలీ మద్యం తయారీ కేసులో ఏడుగురు నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ ప్రారంభించారు.. వీరిని ఐదు రోజులపాటు విచారించనున్నారు.. కోర్టు ఆదేశాలతో నిందితులను జైలు నుంచి ఎక్సైజ్ కార్యాలయానికి శుక్రవారం ఉదయం తరలించారు.. కేసులో నిందితులుగా ఉన్న రవి, బాదల్ దాస్, ప్రదీప్ దాస్, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్, రమేష్ బాబు, అల్లా భక్షు లను కస్టడీ కి తీసుకున్నారు. ఈ ఏడుగురు కూడా అద్దేపల్లి జనార్ధన్ కి నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సహకరించినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీంతో అద్దేపల్లి జనార్ధన్ తో ఉన్న ఆర్థిక సంబంధాలను కూడా అధికారులు విచారణ సందర్భంగా నిందితులను ప్రశ్నించారు.
నకిలీ మద్యం తయారు చేయడం కోసం ప్లాస్టిక్ బాటిల్స్ ను లేబుల్స్ అందించిన ఏ ఫోర్ రవిని పూర్తిస్థాయిలో విచారించారు. ఎంత స్థాయిలో వాటిని అద్దేపల్లి జనార్ధన్‌కు ఎన్నాళ్ళ నుంచి సరఫరా చేస్తున్నారు.. అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒరిస్సాకు చెందిన బాధలుదస్ ప్రదీప్ దాస్ ఇద్దరు కూడా.. నకిలీ మద్యం తయారీ కార్మికులుగా.. పనిచేస్తున్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. దీంతో తమతో ఎవరు టచ్ లోకి వచ్చి ఈ పనిలో చేర్చారు.. అనే అంశాలను విచారణలో తెలుసుకున్నారు. ఇక నకిలీ మద్యం అమ్మకాలు జరిపిన శ్రీనివాస్ వైన్స్ మేనేజర్ కళ్యాణ్ ని కూడా విచారించారు. నకిలీ మద్యం అని తెలిసి అమ్మకాలు ఎలా జరిపారని దీని వెనుక జనార్ధన్ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే విషయాలను ప్రశ్నించారు. ఇక, మరో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి తన కంపెనీలోనే ప్లాస్టిక్ బాటిల్ లను పెద్ద ఎత్తున నకిలీ మద్యం నింపేందుకు జనార్ధన్ కు అమ్మినట్టు గుర్తించారు. దీంతో జనార్ధన్ తో ఏ విధంగా పరిచయం అయింది.. అనే అంశాలతో పాటు ఎన్ని లక్షలు బాటిల్స్ సరఫరా చేశారని వివరాలను అడిగారు విచారణ రేపు కూడా కొనసాగనుంది..