Telangana: ఆస్తి కోసం నవ మాసాలు పెంచి పెద్దచేసిన కన్న తల్లినే ఇంటి నుంచి గెంటివేసిన నిజామాబాద్‌లో జరిగింది.. చేసేదేమీ లేక ఆ తల్లి చెట్టుకింది దీనంగా కూర్చొని కన్నీరు కారుస్తోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే దోమకొండ మండలం సoగమేశ్వర కాలనీలో దారుణం జరిగింది.. ఆస్తి వివాదంలో తల్లిని ఇంటి నుంచి గెంటేశాడు కుమారుడు.. భూమి పంపకం విషయంలో ఇద్దరు కొడుకుల మధ్య వివాదం నడుస్తోంది.. ఘర్షణ కూడా జరిగింది.. అదే తల్లిపాలిక […]
Petrol and Diesel Price: భారత్‌లో పెట్రో ధరలు అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి.. ముడి చమురు ధరలు పెరిగినప్పుడు భారత్‌లో వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి.. కానీ, ముడి చమురు ధరలు తగ్గిన ప్రతీసారి పెట్రో ధరలు తగ్గించడం లేదు.. మరోసారి ముడి చమురు ధరలు తగ్గాయి.. అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం ముడిచమురు ధర తగ్గినప్పటికీ, నేడు దేశంలోని చాలా నగరాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను […]
Gangireddu Melam: భిక్షాటన విషయంలోనూ కొన్ని ఒప్పందాలు ఉంటాయి.. మా ఏరియాలోకి మీరు రావొద్దు.. మీ ప్రాంతంలోకి మేం రాము.. అంతే కాదు.. సామాజిక వర్గాన్ని బట్టి వారు వివిధ రూపాల్లో భిక్షాటన చేస్తుంటారు.. అయితే, భిక్షాటన విషయంలో కుల కట్టుబాట్లను ధిక్కరించారని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.. ఇది కాస్తా చిలికిచిలికి గాలివానగా మారిపోయింది.. ఆ తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. Read Also: Astrology :మే […]
CM KCR: ఈ రోజు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో పాల్గొనాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పొరేషన్స్ ఛైర్మన్లకు పిలుపు అందింది.. ఈ సమావేశంలో జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు […]
* కర్ణాటక నూతన సీఎంపై కొనసాగుతోన్న ఉత్కంఠ.. ఈ రోజు ఉదయం మరోసారి ఖర్గేతో భేటీ కానున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. ఇరువురు నేతలతో నేడు రెండవ విడత చర్చలు తర్వాత అంతిమ నిర్ణయం ప్రకటించనున్న పార్టీ * ఐపీఎల్లో నేడు పంజాబ్‌తో ఢిల్లీ ఢీ.. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఇవాళ సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన.. శ్రీ లక్ష్మీ మహ యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.. […]
Sanchar Saathi portal: కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్.. సంచార్ సాథీ పోర్టల్‌ను ప్రారంభించారు.. వర్చువల్ పద్ధతిలో విజయవాడ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కార్యాలయం నుంచీ ఈ కార్యక్రమాన్ని వీక్షించిన అధికారులు.. అయితే, ఈ పోర్టల్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. సంచార్ సాథీ పోర్టల్ ద్వారా ఒకొక్కరి పేరు మీద ఎన్ని సిమ్ లు ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది.. మొబైల్ ఫోన్ ల ద్వారా చేసే నేరాలను అరికట్టడానికి సంచార్ […]
Andhra Pradesh: పేదలకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్5 జోన్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు అధికారులు.. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలోని పేదలకు 1402.58 ఎకరాలలో భూ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.. నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరం ప్రాంతాలలో లేఅవుట్లలో ఏర్పాటు జరుగుతున్నాయి.. 25 లేఅవుట్లలో అభివృద్ధి పనులు చేపట్టారు.. ఈ పంపిణీ ద్వారా 50,004 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.. Read Also: Imran […]
విచారణకు రాలేను.. సమయం ఇవ్వండి.. సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ రోజు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాల్సి ఉంది.. ఎంపీ అవినాష్ రెడ్డికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించారు.. అయితే, ఈరోజు విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐకి విజ్ఞప్తి చేశారు […]
CM YS Jagan: ఎన్నికల్లో పొత్తుల విషయంలో విపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధుల విడుదల సందర్భంగా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు పేదలు గుర్తుకు వస్తున్నారు.. గత పాలనలో ఎస్సీలకు, మత్స్యకారులకు, బీసీలకు అన్యాయం జరిగింది అని ఆరోపించారు.. నేను చేసిన మంచిని ప్రజలని, దేవుడిని నమ్ముకున్నాను.. కానీ, చంద్రబాబు, దత్త పుత్రుడు పొత్తులు, ఎత్తులు, […]
CM YS Jagan : సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి కష్టం రానివ్వను అని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధుల విడుదల సందర్భంగా బాపట్ల జిల్లా నిజాంపట్లంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ మత్స్య కార భారోసాలో ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల రూపాయలు అందించామని తెలిపారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం మత్స్య కార కుటుంబాలకు ఉపయోగ పడుతుందని.. […]