టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు గమనిక.. ఎల్లుండి నుండి సప్లిమెంటరీ పరీక్షలు
పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 నిమిషాల నుంచి 12.30 నిమిషాల వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం.. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TSBSE) పదో తరగతి సప్లిమెంటరీ హాల్ టికెట్ 2023ని ఈ నెల 8వ తేదీన జారీ చేసింది. తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్ www.bse.telangana.gov.inలో యాక్టివేట్ చేయబడింది. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి తోడు హాల్ టికెట్లు సంబంధిత పాఠశాలలకు పంపించామని తెలిపారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడవన్నారు. ఇదిలా ఉంటే.. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2. 30 గంటల నుంచి సాయంత్రం 5. 30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి.
బిగ్ బ్రేకింగ్.. జనసేనలోకి స్టార్ నిర్మాత
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా తిరుగుతున్న విషయం తెల్సిందే. 2024 ఎన్నికలు దగ్గరపడుతుండడటంతో పవన్.. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాడు. మరో రెండు రోజుల్లో ఆయన వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే జనసేన తరుపున ప్రచారానికి సర్వం సిద్ధం చేస్తున్నారు జనసైనికులు. ఇక మరోపక్క కొత్తవారు జనసేన పార్టీ కండువా కప్పుకొని పవన్ కు తమ మద్దత్తును తెలుపుతున్నారు. తాజాగా జనసేనలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్. భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్.. 2003లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పేరుతో సినిమా నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించాడు. ఇక పవన్ తో అత్తారింటికి దారేది, రామ్ చరణ్ తో మగధీర లాంటి హిట్ సినిమాలను నిర్మించాడు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నేత
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఈ సారి టికెట్ వచ్చేది ఎవరికి? సిట్టింగ్‌లకు అవకాశం ఉంటుందా? ఉండదా? అనే చర్చ సాగుతోంది.. అయితే, వచ్చే ఎన్నికలలో టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టిక్కెట్లు ఇస్తారని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు , రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా చెప్పినట్లు తెలిపారు. రాజమండ్రి రూరల్ టికెట్టు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని వస్తున్న వదంతులు నేపధ్యంలో తనకే మళ్లీ టికెట్టు అని బుచ్చయ్య క్లారిటీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ సమావేశం అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల కరెంట్ కోతలతో పేద ప్రజలు. పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.. గతంలో 400 వచ్చే కరెంటు బిల్ ఇప్పుడు 1400 రూపాయలు వస్తుందని ఆరోపణలు గుప్పించారు. తెలుగుదేశం హయంలో 35 లక్షల కరెంట్ కనెక్షన్లు ఇస్తే.. వైసీపీ హయాంలో కేవలం 8 లక్షలు కూడా ఇవ్వలేదని వివరించారు. మరోవైపు.. వారాహి యాత్ర కొనసాగుతుంది.. చంద్రబాబు యాత్ర.. లోకేష్ యాత్ర సాగుతుంది. అది ఎవరూ ఆపలేరని సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా వైసీపీ సర్కార్‌పై మండి పడుతుందని గుర్తుచేశారు.. నిధులన్నీ గోల్ మాల్ అయిపోయాయని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
నేను ఎవరికీ భయపడను.. ప్రజలు కోసం గొంతెత్తుతూనే ఉంటా..
శ్రీకాకుళం ప్రజలు మూడు సార్లు నన్ను గెలిపించారు, నాకు మంచి గౌరవం ఇచ్చారు.. నేను ఎవరికీ భయపడను ప్రజలు కోసం గొంతెత్తుతూనే ఉంటానని ప్రకటించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రిగా, ఓ పౌరుడుగా అడుగుతున్నా.. చంద్రబాబు నీ హయాంలో ఒక్క రంగం అయినా అభివృద్ధి చేశారా? అని నిలదీశారు.. మా పై అనవసర దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. మీకంటే మేం ఎక్కువ రోడ్లను వేశామని తెలిపారు.. నాలుగు పోర్టుల పనులు ప్రారంభించాం. 8 హార్బర్ లకు శంఖుస్థాపన చేశామని గుర్తుచేశారు.. కేంద్రం స్వయంగా ప్రకటించింన ర్యాంకులు , సర్వేలు దేశంలోనే రాష్ట్రం ర్యాంక్ 3 లో ఉందని తెలిపారు.. బిల్డింగ్ కడితే అబివృద్ధి కాదు.. ప్రజలు సంతోషంగా ఉంటూ జీవన ప్రమాణాలు పెరిగితేనే అది అభివృద్ధి అవుతుందని స్పష్టం చేశారు. స్పీడ్ రైలో , ఎయిర్‌పోర్ట్‌లో విమానం చూపిస్తే నో ప్రజలు సంతోషంగా ఉండరు.. సమాజంలో గొప్ప మార్పుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు.. కానీ, వైఎస్ జగన్ దుర్మార్గుడు, సైకో అని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నమ్మొద్దన్నారు. ప్రజలు ఏం కావాలో సీఎం జగన్‌కు తెలుసు.. అదే ఆయన చేస్తారని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
మారనున్న తెలంగాణ బీజేపీ చీఫ్.. క్లారిటీ ఇచ్చిన మాజీ అధ్యక్షుడు
గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. దీనిపై బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మారే ప్రసక్తే లేదు… ఎన్నికల వరకు ఆయనే కొనసాగుతారన్నారు. అధ్యక్షుడు మారుతాడంటూ అసత్య వార్తలు ప్రచారం చేయకండని, ప్రధాని మోడీ తొమ్మిదేళ్లుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా.. ‘రాష్ట్రంలో కేసీఆర్ తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారు. రాష్ట్రానికి ఏం సాధించారని తెలంగాణ రన్ నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలి. యూనివర్సిటీ లను మూతవేసే దిశగా కేసీఆర్ తీసుకెళ్తున్నారు. విద్యార్థులకు , యూనివర్సిటీ లకు కేటాయిస్తున్న నిదులు తగ్గిపోతున్నాయి. ఉద్యోగ కల్పన విషయంలో కేటీఆర్ చెప్పేదానికి.. వాస్తవానికి చాలా గ్యాప్ ఉంది. బీఆర్ఎస్ ది నో డేటా అవేలబుల్ ప్రభుత్వం. రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు.
కేవలం రూ.5590కే థామ్సన్ వాషింగ్ మెషీన్.. ఈ ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు!
‘థామ్సన్’ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. ధర తక్కువగా ఉండడం, ఎక్కువ కాలం పని చేయడం వలన థామ్సన్ ఎలక్ట్రానిక్ వస్తువులకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే మీకు వాషింగ్ మెషీన్ అవసరం ఉంటే.. మార్కెట్లో ఎక్కడా తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ బడ్జెట్‌కు సరిపోయేలా, చాలా సంవత్సరాలుగా పనిచేసే అత్యంత ప్రజాదరణ పొందిన థామ్సన్ వాషింగ్ మెషీన్ అందుబాటులో ఉంది. కేవలం మీరు రూ.5590కే వాషింగ్ మెషీన్ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం. పైన చెప్పిన వాషింగ్ మెషిన్ మరేదో కాదు.. థామ్సన్ 7 కిలోల సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్. ఇది 7 కిలోల ఎంపికలో వస్తుంది. దాంతో మీరు ఒకేసారి చాలా బట్టలు ఉతకడానికి వీలుంటుంది. ఇది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ కాబట్టి మీరు ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. థామ్సన్ 7 కిలోల సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ టాప్ లోడింగ్ మోడల్ అని మీరు గుర్తుంచుకోవాలి. ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీలు పాదాల సమస్యలను కలిగి ఉన్నారు. కాబట్టి ఆ సమస్యను దృష్టిలో ఉంచుకుని.. ఈ వాషింగ్ మెషీన్ ఉత్తమ ఎంపికగా నిరూపించబడుతుంది. ఎందుకంటే ఈ వాషింగ్ మెషీన్ నాబ్‌లతో వస్తుంది. వీటితో ఈ వాషింగ్ మెషీన్‌ను చాలా సులభంగా ఉపయోగించవచ్చు. ఇలాంటి సూపర్ వాషింగ్ మెషీన్‌ను మీరు కేవలం రూ. 6 వేల లోపే సొంతం చేసుకోవచ్చు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రియాంక గాంధీ 5 హామీలు.. అవేంటంటే?
ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు ఐదు హామీలను ప్రకటించారు. ఆమె జబల్‌పూర్ జిల్లాలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో కూడా ప్రసంగించారు. ఐదు హామీల గురించి మాట్లాడుతూ.. “రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలవారీ రూ.1,500 సహాయం, ప్రతి ఇంటికి రూ.500 చొప్పున ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్, 100 యూనిట్ల విద్యుత్ ఉచితం, 200 యూనిట్లు సగం ధరకు అందజేస్తామని ప్రియాంక గాంధీ చెప్పారు. రైతుల రుణాలు మాఫీ చేసి రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. తాము నర్మదా నది ఒడ్డుకు వచ్చి అబద్ధం చెప్పమన్నారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. వారు ఇక్కడిక ప్రకటనలు చేస్తారు తప్ప వాటిని నెరవేర్చరన్నారు. వారు డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు. వారు ఎక్కడైనా అదే చెబుతారన్నారు. డబుల్ ఇంజిన్ గురించి మాట్లాడటం మానేసి పని ప్రారంభించాలని కర్ణాటక ప్రజలు వారికి చూపించారు. “మా పార్టీ ఏ వాగ్దానాలు చేసినా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో వాటిని నెరవేర్చాం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పరిస్థితి చూడండి. ప్రజలు ఇది గ్రహిస్తారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చాలా అభివృద్ధి జరిగింది.” అని ఆమె చెప్పారు.
సెక్స్ స్కాండల్ లో ఇరుకున్న భర్త.. కాజోల్ ఏం చేయనుంది..?
బాలీవుడ్ బ్యూటీ కాజోల్ పెళ్లి తరువాత త్రిభంగ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ఇక ఈ సిరీస్ మంచి గుర్తింపును అందుకుంది. తాజాగా ఈ సిరీస్ తరువాత అమ్మడు నటిస్తున్న మరో సిరీస్ ది ట్రైల్. హాలీవుడ్ హిట్ సిరీస్ ది గుడ్ వైఫ్ కు రీమేక్ గా ఈ సిరీస్ తెరకెక్కుతుంది. మొదట ఈ సిరీస్ కు ది గుడ్ వైఫ్ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. కానీ, అనుకోని కారణాలవలన చివరకు ది ట్రైల్ అనే పేరును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సుపర్న్ వర్మ దర్శకత్వంవహించిన ఈ సిరీస్.. డిస్నీప్లస్ హాట్ స్టార్ లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది.