Dharmana Prasada Rao: శ్రీకాకుళం ప్రజలు మూడు సార్లు నన్ను గెలిపించారు, నాకు మంచి గౌరవం ఇచ్చారు.. నేను ఎవరికీ భయపడను ప్రజలు కోసం గొంతెత్తుతూనే ఉంటానని ప్రకటించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రిగా, ఓ పౌరుడుగా అడుగుతున్నా.. చంద్రబాబు నీ హయాంలో ఒక్క రంగం అయినా అభివృద్ధి చేశారా? అని నిలదీశారు.. మా పై అనవసర దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. మీకంటే మేం ఎక్కువ రోడ్లను వేశామని తెలిపారు.. నాలుగు పోర్టుల పనులు ప్రారంభించాం. 8 హార్బర్ లకు శంఖుస్థాపన చేశామని గుర్తుచేశారు.. కేంద్రం స్వయంగా ప్రకటించింన ర్యాంకులు , సర్వేలు దేశంలోనే రాష్ట్రం ర్యాంక్ 3 లో ఉందని తెలిపారు.. బిల్డింగ్ కడితే అబివృద్ధి కాదు.. ప్రజలు సంతోషంగా ఉంటూ జీవన ప్రమాణాలు పెరిగితేనే అది అభివృద్ధి అవుతుందని స్పష్టం చేశారు. స్పీడ్ రైలో , ఎయిర్‌పోర్ట్‌లో విమానం చూపిస్తే నో ప్రజలు సంతోషంగా ఉండరు.. సమాజంలో గొప్ప మార్పుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు.. కానీ, వైఎస్ జగన్ దుర్మార్గుడు, సైకో అని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నమ్మొద్దన్నారు. ప్రజలు ఏం కావాలో సీఎం జగన్‌కు తెలుసు.. అదే ఆయన చేస్తారని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: Madhyapradesh: మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రియాంక గాంధీ 5 హామీలు.. అవేంటంటే?