* బెంగళూరు: ఈ రోజు రాత్రి 7 గంటలకు కర్ణాటక సీఎల్పీ భేటీ.. సమావేశానికి ప్రతి ఒక్కరు తప్పని సరిగా హాజరు కావాలంటూ KPCC అధ్యక్షుడి హోదాలో DK శివకుమార్ లేఖ.. కాంగ్రెస్ ఎంపీలు కూడా హాజరవ్వాలని పిలుపు * ఈ రోజు ఢిల్లీ నుంచి బెంగళూరుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. * హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ.. కొత్త సచివాలయంలో మొదటి కేబినెట్ సమావేశం .. జూన్ 2 […]
Snake: ఎండలు మండిపోతున్నాయి.. ఇంటి నుంచి బయటకు అడుగు బయటపెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. మనుషులే కాదు.. మూగజీవాలు, జంతువులు, పక్షులు, పాములు కూడా అల్లాడి పోతున్నాయి.. ఎండ వేడి తట్టుకోలేక.. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వెళ్లిపోతున్నాయి.. వాతావరణ శాఖ అధికారులు కూడా అత్యవసరం అయితేనే బయటకు రండి.. వడగాలులు, వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.. ఓ నాగు పాము ఎండకు అల్లాడిపోయింది.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ నాగుపాము ఎండవేడికి తట్టుకోలేక.. నీటి […]
Five AP villages appealed to Governor: భద్రాచలం సరిహద్దులో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆ ఐదు గ్రామాల ప్రజలు గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన సందర్బంగా గిరిజనులతో ఆరోగ్య రక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా పురుషోత్తమపట్నం, ఎటపాక, పిచుకుల పాడు, కన్నాయిగూడెం, గుండాలకు చెందిన గిరిజనులు గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఏపీలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నాం, ఏపీ […]
Bandi Sanjay Kumar: మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్‌ను నిషేధించబోతున్నారు అని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను కూడా కేసీఆర్ ప్రభుత్వం నిషేధిస్తోంది. ఉద్యమించే నాయకులను అరెస్ట్ చేసి బెదిరిస్తోంది. మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్ ను నిషేధించబోతున్నారు అని పేర్కొన్నారు.. తెలంగాణ సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే.. వందల కోట్ల ప్రజా ధనంతో […]
Telangana Secretariat: సచివాలయంలోకి వెళ్ళే వారికి ఇకపై డిజిటల్ పాస్‌లను ఇవ్వాలని సెక్యూరిటీ అధికారులు ఆలోచిస్తున్నారు. డిజిటల్ పాసులతో సచివాలయంలోకి అడుగు పెట్టిన వారు.. ఒక శాఖకు చెందిన అధికారులను మాత్రమే కలవడానికి అవకాశం ఉంటుంది. డిజిటల్ పాస్ తీసుకొని సచివాలయంలోకి వెళ్ళిన తరువాత గతంలో మాదిరిగా తనకు అవసరం ఉన్న ఇతర శాఖల అధికారులతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అనుకుంటే.. ఇకపై కుదరదు. సచివాలయంలోకి వెళ్ళాలి అనుకుంటే ఏ శాఖ అధికారులను కలవాలో ముందుగా […]
IRCTC Ticket Booking: అర్జంట్‌గా రైలు ప్రయాణం చేయాల్సి ఉందా..? సమయానికి డబ్బులు జేబులో లేవా? ఆ మొత్తాన్ని సమకూర్చుకునే సమయం కూడా లేదా..? అయితే, టెన్షన్ పడాల్సిన పనేలేదు.. హాయిగా మీరు జర్నీ చేయొచ్చు.. అదేంటి? ఉచితంగా రైలు ప్రయాణమా? అనే సందేహం వచ్చిందేమో.. రైలు ప్రయాణమే.. కానీ, ఉచితం కాదండోయ్.. ఎందుకంటే.. ఇప్పుడు డబ్బులు లేకున్నా టికెట్ బుక్ చేసుకోవచ్చు.. పేమెంట్ మాత్రం లేట్‌గా చేసే అవకాశం ఉంది.. ఈ సదుపాయాన్ని ఐఆర్సీటీసీ అందుబాటులోకి […]
నేను తమిళ ఆడబిడ్డను.. తెలంగాణకు అక్కను.. నేను మీతో ఉన్నాను.. మీ కుటుంబంలో ఒక సభ్యురాలని.. మీ సమస్యలు విన్నాను.. నేను మీతో ఉన్నాను కచ్చితంగా మీ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా నా వంతు ప్రయత్నం చేస్తాను అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..
Governor Tamilisai: భద్రాద్రి రాముడి సేవలో తరించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న ఆమె.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు.. ఆలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసైకి భద్రాద్రి ఆలయం ఈవో రమాదేవి, ఆలయ సిబ్బంది, దేవస్థానం వేద పండితులు.. పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.. ఆ తర్వాత దేవస్థానంలోని మూలవరులను దర్శించుకున్న ఆమె.. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో గవర్నర్‌కు దేవస్థానం […]
hyderabad Crime: హైదరాబాద్‌లోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది.. తీగలగూడలో మొండెం లేని గుర్తు తెలియని మహిళ తల లభ్యం అయ్యింది.. ఓ నల్ల కవర్లో మహిళ తల నుంచి మూసి పరివాహక ప్రాంతంలో విసిరేసి వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలను స్వాధీనం చేసుకున్నారు.. హత్య చేసి తలను తెచ్చి పడవేశారని భావిస్తున్నారు.. హత్యకు గురైన మహిళ ముస్లిం మహిళగా అనుమానిస్తున్నారు పోలీసులు.. అయితే, […]
మందు తాగేవారిలో ఎర్రటి దద్దుర్లతో ‘లిక్కర్ అలర్జీ’ అనే అరుదైన వ్యాధి సోకుతుందని చాలా మందికి ఇప్పటి వరకు తెలిసి ఉండదు.. కానీ, దాని గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చేంది.. ఎందుకంటే మనదేశంలో లిక్కర్ అలర్జీని ఇటీవల తొలిసారి హైదరాబాద్‌లోనే గుర్తించారు.