పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కులం అంశంపై నే చేస్తున్నారని స్పష్టం అవుతుందని ఆరోపించారు సజ్జల.. ముద్రగడ పద్మనాభం తన కులం కోసం గట్టిగా నిలబడిన వ్యక్తి.. ఆ కృషిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్న ఆయన.. ముద్రగడ నిజాయితీ గల వ్యక్తి.. మా పార్టీ విధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం అన్నారు.
భట్టి విక్రమార్క పాదయాత్ర 100వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు #PeopelsMarch100Days అనే హాష్ ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు.. మరోవైపు.. #PeoplesLeaderBhatti అనే హాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది..
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.
కసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్యుతాపురం వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్... ఏపీలో భూముల విలువలు తగ్గాయని చంద్రబాబు, కేసీఆర్‌కు చెప్పరంటా అని ఎద్దేవా చేసిన ఆయన.. ఒకసారి అచ్యుతాపురం కేసీఆర్ వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందని సూచించారు