Liquor Sales: ఆంధ్రప్రదేశ్‌లో గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు భారీ తగ్గాయి.. అయితే, ఇదే సమయంలో ఆదాయం మాత్రం పెరిగింది.. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ కు వివరించారు అధికారులు.. ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం జగన్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు.. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు.. విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరుపై ఆరా తీశారు.. అయితే, గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం పెరిగిందన్నారు అధికారులు. 2018–19తో పోలిస్తే.. మద్యం అమ్మకాలు తగ్గాయని గణాకాంలు తీశారు. 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా, 2022–23లో 335.98 లక్షల కేసులు విక్రయించారు.. ఇక, 2018–19లో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులు జరగగా.. 2022–23లో 116.76 లక్షల కేసులు అమ్ముడు పోయాయి.. 2018–19 ఏప్రిల్, మే, జూన్ నెలలతో పోల్చిచూస్తే, 2023–24లో ఏప్రిల్, మే, జూన్ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్ 56.51 శాతంగా తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని, లిక్కర్ అమ్మకాల్లో మైనస్ 5.28 శాతంగా తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించారు అధికారులు..
Read Also: CM YS Jagan: ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం సమీక్ష.. వాటిపై ఫోకస్ పెట్టండి..
ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకూ 91శాతం లక్ష్యం చేరిన జీఎస్టీ (కాంపెన్‌సేషన్ కాకుండా) పన్నుల వసూళ్లు, అధికారులు వెల్లడించారు.. జూన్ వరకూ రూ. 7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే 23.74 శాతం జీఎస్టీ వసూళ్ల పెరుగుదల కనిపించిందని సీఎంకు తెలిపారు.. అయితే, మద్యం అమ్మకాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆయన.. వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు చూపాలన్నారు. గతంలో గనులు, ఖనిజాలు శాఖ, ఏపీఎండీసీ నుంచి వచ్చే ఆదాయాలుకు, ఈ ప్రభుత్వం వచ్చాక వస్తున్న ఆదాయాల్లో భారీ వ్యత్యాసం ఉందన్నారు.. ఈ విభాగాల పరిధిలో ఆదాయాలు గణనీయంగా పెరిగాయన్నారు.. ఇక, ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు.. జిల్లా కలెక్టర్ల భాగస్వామ్యాన్ని పెంచాలని.. క్రమం తప్పకుండా వారితో సమీక్షలు నిర్వహించాలని.. ఆదాయాలు పెంచుకునే విధానాలపై వారికి కూడా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.