YSRCP: పవన్ జీవితంలోనూ నటిస్తున్నారు.. సినిమా డైలాగ్స్ ఇక్కడ పనికిరావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటల దాడి కొనసాగుతూనే ఉంది.. వారాహి విజయయాత్రలో అధికార పార్టీ, సీఎం వైఎస్ జగన్, ఇతర నేతలపై పదునైన విమర్శలు చేస్తూ వచ్చారు పవన్.. వాటికి అదే స్థాయిలో అధికాపరక్షం నుంచి కౌంటర్లు పడుతున్నాయి.. ఈ రోజుల నంద్యాలలో మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు.. పవన్ కల్యాణ్‌తో పాటు టీడీపీ చీఫ్ చంద్రబాబుపై కూడా విరుచుకుపడ్డారు.. పవన్ కల్యాణ్.. సినిమాల్లో లాగే నిజ జీవితంలో కూడా నటిస్తున్నారని ఆరోపించారు ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సెక్స్ రాకెట్, కాల్ మనీల గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు.. ఎందుకోసం మాట్లాడరు అని నిలదీశారు.
ఇక, వాలంటీర్ల గురించి పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు, క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి.. సినిమాల్లో చెప్పే డైలాగ్‌లు నిజజీవితంలో పనికిరావని అని పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని హితవుపలికారు కాటసాని రాంభూపాల్ రెడ్డి.. మరోవైపు.. 2009లో వైఎస్ జగన్, పవన్ కల్యాణ్.. ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు.. అయితే, పవన్ రెండు పార్టీలు మారారు, రెండు చోట్ల ఓడిపోయారు.. కానీ, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు ఎమ్మెల్యే శిల్పా రవి.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
కాగా, జనసేన నేత సాయిపై దాడి చేసిన శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్, రెండు చెంపలు వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. మీడియాలోనూ ప్రముఖంగా ప్రసారం అయ్యింది.. ఈ ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించి సీఐ అంజూయాదవ్‌కు నోటీసులు జారీ చేసింది.. ఇక, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై చేయి పడితే తానే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు తిరుపతికి వెళ్లారు.. సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.. సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశాను.. ఎవరికి ఇబ్బంది లేకుండా.. ఆయుధాలు లేకుండా శాంతియుత నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు.. సాయి శాంతియుతంగా నిరసన చేపట్టారు.. కానీ, సీఐ రాజ్యంగా విరుద్ధంగా సాయిని కొట్టారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!