ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం సమీక్ష.. వాటిపై ఫోకస్ పెట్టండి..
ఆదాయాన్నిచ్చే శాఖలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో వివిధ విభాగాల పనితీరును ఈ సమావేశంలో సమీక్షించారు.. విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరుపై ఆరా తీశారు.. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకూ 91శాతం లక్ష్యం చేరిన జీఎస్టీ (కాంపెన్‌సేషన్ కాకుండా) పన్నుల వసూళ్లు, అధికారుల వెల్లడించారు.. జూన్ వరకు రూ. 7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే 23.74 శాతం జీఎస్టీ వసూళ్ల పెరుగుదల కనిపించిందని సీఎంకు వివరించారు అధికారులు. ఇక, 2018–19తో పోలిస్తే.. మద్యం అమ్మకాలు తగ్గినట్టు చెబుతున్నారు. 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా, 2022–23లో 335.98 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. 2018–19లో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులుకాగా, 2022–23లో 116.76 లక్షల కేసులు అమ్ముడుపోయాయి.. 2018–19 ఏప్రిల్, మే, జూన్ నెలలతో పోల్చిచూస్తే, 2023–24లో ఏప్రిల్, మే, జూన్ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్ 56.51 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని, లిక్కర్ అమ్మకాల్లో మైనస్ 5.28 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని ఈ సందర్భంగా వెల్లడించారు అధికారులు.
తగ్గిన మద్యం అమ్మకాలు.. పెరిగిన ఆదాయం..
ఆంధ్రప్రదేశ్‌లో గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు భారీ తగ్గాయి.. అయితే, ఇదే సమయంలో ఆదాయం మాత్రం పెరిగింది.. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ కు వివరించారు అధికారులు.. ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం జగన్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు.. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు.. విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరుపై ఆరా తీశారు.. అయితే, గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం పెరిగిందన్నారు అధికారులు. 2018–19తో పోలిస్తే.. మద్యం అమ్మకాలు తగ్గాయని గణాకాంలు తీశారు. 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా, 2022–23లో 335.98 లక్షల కేసులు విక్రయించారు.. ఇక, 2018–19లో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులు జరగగా.. 2022–23లో 116.76 లక్షల కేసులు అమ్ముడు పోయాయి.. 2018–19 ఏప్రిల్, మే, జూన్ నెలలతో పోల్చిచూస్తే, 2023–24లో ఏప్రిల్, మే, జూన్ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్ 56.51 శాతంగా తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని, లిక్కర్ అమ్మకాల్లో మైనస్ 5.28 శాతంగా తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించారు అధికారులు..
పవన్ జీవితంలోనూ నటిస్తున్నారు.. సినిమా డైలాగ్స్ ఇక్కడ పనికిరావు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటల దాడి కొనసాగుతూనే ఉంది.. వారాహి విజయయాత్రలో అధికార పార్టీ, సీఎం వైఎస్ జగన్, ఇతర నేతలపై పదునైన విమర్శలు చేస్తూ వచ్చారు పవన్.. వాటికి అదే స్థాయిలో అధికాపరక్షం నుంచి కౌంటర్లు పడుతున్నాయి.. ఈ రోజుల నంద్యాలలో మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు.. పవన్ కల్యాణ్‌తో పాటు టీడీపీ చీఫ్ చంద్రబాబుపై కూడా విరుచుకుపడ్డారు.. పవన్ కల్యాణ్.. సినిమాల్లో లాగే నిజ జీవితంలో కూడా నటిస్తున్నారని ఆరోపించారు ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సెక్స్ రాకెట్, కాల్ మనీల గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు.. ఎందుకోసం మాట్లాడరు అని నిలదీశారు. ఇక, వాలంటీర్ల గురించి పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు, క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి.. సినిమాల్లో చెప్పే డైలాగ్‌లు నిజజీవితంలో పనికిరావని అని పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని హితవుపలికారు కాటసాని రాంభూపాల్ రెడ్డి.. మరోవైపు.. 2009లో వైఎస్ జగన్, పవన్ కల్యాణ్.. ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు.. అయితే, పవన్ రెండు పార్టీలు మారారు, రెండు చోట్ల ఓడిపోయారు.. కానీ, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు ఎమ్మెల్యే శిల్పా రవి.
మిడ్ మానేర్ నీటిని విడుదల చేసిన మంత్రి గంగుల
మిడ్ మానేరు నుండి లోయర్ మానేరు డ్యామ్ దిగువకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు కలిసి నీటిని విడుదల చేశారు రాష్ట్ర బీసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎంఎండీకి 2,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నాలుగు వరద గేట్లను ఎత్తి 5,500 క్యూసెక్కుల నీటిని లోయర్ మానేర్ డ్యామ్‌లోకి వదులుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. వర్షాభావం రైతులను నిరాశపరిచినా సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రైతాంగాన్ని ఆదుకున్నదన్నారు. ఈ నీటితో దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరుతుందని, జూలై 25 నుంచి లోయర్ మానేర్ డ్యాం నుంచి నీటి విడుదల ప్రారంభిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో ధర్నా చేయని రోజు ఉందా.?
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన వరంగల్ జిల్లాలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రైతు కాదు, బ్రోకర్, పైరవీకారుడని దేశమంతా తెలుసు అని విమర్శించారు. రైతులను అవమానపరిచినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పే వరకు వదిలి పెట్టమని ఆయన అన్నారు. 8 రోజులపాటు ఉద్యమిస్తామని, రైతులకు కాంగ్రెస్ మోసాలపై అవగాహన కల్పించి గుణపాఠం చెప్పేలా చేస్తామని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి ఘోరంగా మాట్లాడారని, రైతులంతా సమావేశమై కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలని తీర్మాణాలు చేశారన్నారు. అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి ఒక్కటే అడుగుతున్నా… టీడీపీలో ఉన్నప్పుడు నాతో పని చేశారు. కాంగ్రెస్ హాయాంలో కరెంట్ సమస్యతో ఎండిపోయిన పంటలను ప్రదర్శిస్తూ అసెంబ్లీ వద్ద ఆందోళన చేయలేదా? కాంగ్రెస్ పాలనలో ధర్నా చేయని రోజు ఉందా? కిరణ్ కుమార్ రెడ్డి కరెంట్ వైర్లపై బట్టలు ఎండవేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. ఒక గంట కరెంట్ కు ఎకరం పారుతుందని అంటున్నారు.
రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం
దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల వేడి ఇప్పుడే రాజుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని ప్రతిపక్షాలన్నీ కంకణం కట్టుకుని ఒక్కతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాల ఐక్యతా సమావేశానికి ధీటుగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరుగునుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఈ సమావేశానికి 38 పార్టీలు హాజరవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ తొమ్మిది సంవత్సరాలలో ఎన్డీయే గ్రాఫ్ బాగా పెరిగిందని తెలిపాడు. దేశంలో మంచి పాలన, దేశాభివృద్ధి ఎన్డీయేతోనే సాధ్యం అయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బలమైన నాయకత్వంలో 9 ఏళ్లలో దేశాభివృద్ధిని అందరూ చూస్తున్నారు. ఎన్డీయే కూటమి అధికారం కోసం కాదు దేశ సేవ కోసం పని చేస్తుంది అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఎన్డీయే మిత్రపక్షాల ది బావ సారూప్యతతో కూడిన ఐక్యత.. ఎన్డీయే కూటమితో దేశాన్ని మరింత బలంగా చెయ్యడమే మా లక్ష్యం అని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల కూటమిపై జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిపక్షాల కూటమిలో నేతలు ఉన్నారు కానీ నీతి లేదు.. ప్రతిపక్షాల సమావేశం కేవలం ఫొటో దిగడానికి బాగుంటుంది అని ఆయన కామెంట్స్ చేశారు. 10 ఏళ్ల యూపీఏ పాలన అవినీతితో కూడింది.. దేశ హితం కోసమే ఎన్డీయే కూటమి పని చేస్తుంది అని తెలిపారు.
బెంగళూరులో విపక్ష పార్టీ నేతల సమావేశం
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విపక్షాల సమావేశంలో 26 పార్టీలకు చెందిన 53 మంది నేతలు హాజరు అయ్యారు. రేపటి అజెండా 6 ముఖ్యమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఉమ్మడి కనీస కార్యక్రమాలను రూపొందించేందుకు సబ్ కమిటీ ఏర్పాటుతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఇది విపక్షాల పొత్తుల వారధిగా నిలువనుంది. కూటమి పరిణామాల గురించి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి పని చేస్తారు. కూటమి ఉమ్మడి కార్యక్రమాల ప్రణాళిక కోసం సబ్‌కమిటీ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీల రాజకీయ ర్యాలీల నిర్వహణతో పాటు ఎక్కడెక్కడ సదస్సులు నిర్వహించాలి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఎలా ఏర్పాటు చేయాలి అనే దానిపై చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటి రూపకల్పనకు ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది. సీట్ల కేటాయింపుతో పాటు రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీకి మరింత గుర్తింపు.. ఇచ్చేందుకు ఈ సందర్భంగా నేతలు తమ తమ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరిస్తున్నారు.
తక్కువ టైం.. ఎక్కువ వడ్డీ.. ఈ ఎఫ్‌డీ స్కీమ్ తెలిస్తే వదలరు..!
తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని ఎవరైనా అనుకుంటారు.. అయితే, బయట వడ్డీలకు తిప్పితే బాగానే సంపాదించవచ్చు.. కానీ, ఆ డబ్బులు తిరిగి వస్తాయా? అంటే గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి.. దీంతో.. తక్కువ వడ్డీ అయినా.. వినియోగదారులు బ్యాంకులను ఆశ్రయిస్తారు.. ఎక్కువ వడ్డీ కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్కీమ్‌లను పరిశీలిస్తుంటారు.. అయితే, తక్కువ కాలపరిమితితో ఎక్కువ వడ్డీనిచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం చూస్తున్నవారికి అదిరిపోయే వార్త చెప్పింది ఐడీబీఐ బ్యాంక్ .. 375 రోజుల కాలపరిమితితో కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ను తీసుకొచ్చింది.. ఈ తాజా స్కీమ్ ఈ నెల 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.. ఈ కొత్త ఎఫ్‌డీ పథకం ద్వారా సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది ఐడీబీఐ. ఐడీబీఐ యొక్క అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఎఫ్‌డీ స్కీమ్‌లను తీసుకొచ్చింది.. 375 రోజుల, 444 రోజుల ఎఫ్‌డీ స్కీమ్‌లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ వరకు ఇవి అమలులో ఉంటాయంటూ సదరు బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 375 రోజుల స్కీమ్ కింద సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుండగా.. అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ 444 రోజుల స్కీమ్ ద్వారా గరిష్టంగా 7.65 శాతం వడ్డీని అందిస్తోంది.. ఇక, సీనియర్ సిటిజన్లకు గరిష్ట రేటు 7.75 శాతంగా వడ్డీ అందించనున్నట్టు ఐడీబీఐ పేర్కొంది..
రెస్టారెంట్‌కు వెళ్తున్నారా..? ఇక, ఈ ఛార్జీలు కూడా వేస్తున్నారు..!
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ బిల్ విషయానికి వస్తే.. బ్రిటన్‌లోని ఓ మహిళ తన స్నేహితులతో కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లింది. కబుర్లు చెప్పుకుంటూ.. నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు.. ఇక, ఫుడ్ రానేవచ్చింది.. ముచ్చట్లు పెట్టుకుంటూ.. ఆ ఫుడ్ లాగించేశారు.. ఇక, బిల్ వచ్చే టైం రానేవచ్చింది.. వెయిటర్ వచ్చి బిల్ టేబుల్‌పై పెట్టేశాడు.. కానీ, బిల్ చూసి షాక్ అవ్వడం వారి వంతైంది. ఎందుకంటే ఆ రెస్టారెంట్‌లో లైవ్ మ్యూజిక్ కార్యక్రమం నడుస్తుండా.. ఆ పాటలు విన్నందుకు అదనంగా 8 పౌండ్లు బిల్‌లో చేర్చారు.. వీరు మొత్తం నలుగురు ఎళ్లారు కాబట్టి.. ఒక్కొక్కరికి 8 పౌండ్ల చొప్పున 32 పౌండ్లు వడ్డించారు. చేసేది ఏమీ లేక.. ఆ బిల్ పే చేసినా.. సదరు ఆ బిల్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేసి.. ఏమిటీ విడ్డూరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. దీంతో.. ఆ బిల్ కాస్తా వైరల్‌గా మారిపోయింది.. ఇక, మా రెస్టారెంట్‌లో ప్రతి రాత్రి సంగీతం ఉంటుంది.. సంగీతం ప్లే అవుతున్నప్పుడు ఒక వ్యక్తికి 8 పౌండ్ల చొప్పున ఛార్జీ ఉంటుందని మెనులో పేర్కొంది సదరు రెస్టారెంట్.. ఆ డబ్బు సంగీతకారుడుకి చేరింది. ఎవరూ ఫిర్యాదు చేయలేదు అని కూడా చెబుతున్నారు.. ఇక, లైవ్ మ్యూజిక్ వినడానికి ఛార్జీ చాలా సంవత్సరాలుగా ఉంది, కానీ, వారు సాధారణంగా డోర్ వద్ద ఆ డబ్బును వసూలు చేస్తారు. అయినప్పటికీ, ప్రజలు ఇప్పుడు నగదును తీసుకెళ్లడం లేదు కాబట్టి.. దానిని బిల్లుకు జోడించారు అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.. ఇది డోర్ కవర్ ఛార్జ్. బ్యాండ్ బాగున్నంత వరకు మరియు ఛార్జ్ ముందుగా ప్రకటించినంత వరకు నేను దానిని పెద్దగా పట్టించుకోని అని మరొకరు పేర్కొన్నారు.. మరికొందరు తమ సొంత బిల్లుపై ఆ చార్జీని గుర్తిస్తే చికాకు వస్తుందంటున్నారు.. సంగీతానికి ఛార్జీ ఉందని స్పష్టమైన సంకేతం లేకుంటే నేను దానిని పట్టించుకోను.. ఆర్డర్ చేసే ముందు వారు దీనిని బహిర్గతం చేయాలి ఇంకో వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.. ఇలా మొత్తంగా ఆ మ్యూజిక్ చార్జ్ మాత్రం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. మన దగ్గర కూడా ఇలాంటి వడ్డింపు వస్తుందేమో చూసుకోండి మరి..
డేటింగ్ యాప్ లో తల్లికి నలుగురిని సెట్ చేసిన కూతురు..
సుచిత్రా కృష్ణమూర్తి, శేఖర్ కపూర్ అనే వ్యక్తిని 1997లో వివాహం చేసుకున్నారు. 2006లో విడాకులు తీసుకున్నారు. ఈయన నటుడు, చిత్రనిర్మాత ఒక కుమార్తె కావేరీ కపూర్‌ను పంచుకున్నారు, ఆమె గాయని మరియు త్వరలో హిందీ చిత్రాలలో తన నటనను ప్రారంభించనుంది. కావేరి తన తల్లితో కలిసి ఉంటోంది. ఒక కొత్త ఇంటర్వ్యూలో, సుచిత్ర సింగిల్ పేరెంట్‌గా, తన కుమార్తెతో అస్సలు కఠినంగా ఉండదని మరియు తన స్వంత తల్లిదండ్రులు ఎలా ఉండేవారో దానికి ‘విరుద్ధం’ అని చెప్పారు. డేటింగ్ యాప్‌లో చేరమని కావేరి తనను బలవంతం చేసిందని కూడా సుచిత్ర వెల్లడించింది. కొంత కాలం క్రితం నా కూతురు కావేరి నన్ను డేటింగ్ సైట్‌లో పెట్టింది. నేను ఆమెకు ప్రామిస్ చేశాను కాబట్టి నేను ఓకే చెప్పాను. నేను చాలా విసుగు చెందాను మరియు ఇది నా దృశ్యం కాదని ఆమె బచ్చా (బిడ్డ)తో చెప్పాను. ఆమె నా పేరును నమోదు చేసి, నా ప్రొఫైల్‌ను ఉంచింది, తర్వాత నేను కొన్ని తేదీలకు వెళ్లాలని పట్టుబట్టింది… నేను మీ కోసమే చేశానని చెప్పాను, ఇప్పుడు నేను చేయలేను.. నా స్వంతంగా బాగానే ఉన్నాను,అని ఒక ఇంటర్వ్యూ లో సుచిత్ర పింక్‌విల్లాలో చెప్పారు… మొదట్లో తన ఫోటో పెట్టిన తర్వాత తనకు కొన్ని ‘విచిత్రమైన’ మెసేజ్‌లు రావడంతో దాన్ని మార్చేశానని చెప్పింది. అది ‘చాలా ఒత్తిడి’ అని తాను భావిస్తున్నానని ఆమె చెప్పింది…
ఇక ఆ రెండు సినిమాలు ఎన్నికలయ్యాకే.. కానీ ఓజీ మాత్రం సంక్రాంతి బరిలోకి?
పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీబిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన చేతుల్లో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. అయితే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూట్ ఇప్పట్లో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. నిజానికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నా ఎక్కువ రోజులు షూట్ కూడా జరగలేదు. కేవలం రెండు షెడ్యూల్స్ షూట్ జరిగగా ఓ పది శాతం షూటింగ్ అయి ఉంటుందని అంచనా. ఇక వచ్చే సంవత్సరమే ఏపీలో ఎలక్షన్స్ ఉండటంతో పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రలతో బిజీగా ఉండడంతో పవన్ డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. OGకి సుమారు 20 రోజులు పవన్ డేట్స్ ఇస్తే షూటింగ్ అయిపోతుంది కాబట్టి ఎలాగైనా ఈ సినిమాకి డేట్స్ ఇస్తారు కానీ ఉస్తాద్ అసలు షూటింగ్ చేయాలంటే చాలా డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హరిహరవీరమల్లు కోసం కూడా మేకోవర్ అవ్వాలి కాబట్టి ఆ సినిమాకి కూడా డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపంచడం లేదు. ఒకవేళ ఏపీలో ఎలక్షన్స్ అయ్యాక అప్పటి పరిస్థితిని బట్టి ఈ సినిమాల షూటింగ్స్ ఉండొచ్చని అంటున్నారు.