New Charges in Restaurant: వీకెండ్ వచ్చిందంటే లేదా మరేదైనా సెలవు దొరికిందంటే.. సరదాగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో నచ్చిన రెస్టారెంట్‌కు వెళ్లి, మెచ్చిన ఫుడ్‌ను లాగించేస్తుంటారు.. ఇక, కొన్ని రెస్టారెంట్లలో లైవ్ మ్యూజిక్‌లు కూడా ఉంటాయి.. మీరు వెళ్లిన రెస్టారెంట్‌లో లైవ్ మ్యూజిక్ ఉందేమో చూడండి.. ఎందుకంటే.. దానికి కూడా ప్రత్యేకంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.. అయితే, ఇప్పటికిప్పుడు మన దగ్గర ఈ ఛార్జీలు వసూలు చేస్తారో తెలియదు.. కానీ, ఎవరైనా స్టార్ట్ చేశారంటే.. అదే ఫాలో అవుతుంటారు కదా..! త్వరలోనే అది కూడా జరుగుతుందేమో మరి..!
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ బిల్ విషయానికి వస్తే.. బ్రిటన్‌లోని ఓ మహిళ తన స్నేహితులతో కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లింది. కబుర్లు చెప్పుకుంటూ.. నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు.. ఇక, ఫుడ్ రానేవచ్చింది.. ముచ్చట్లు పెట్టుకుంటూ.. ఆ ఫుడ్ లాగించేశారు.. ఇక, బిల్ వచ్చే టైం రానేవచ్చింది.. వెయిటర్ వచ్చి బిల్ టేబుల్‌పై పెట్టేశాడు.. కానీ, బిల్ చూసి షాక్ అవ్వడం వారి వంతైంది. ఎందుకంటే ఆ రెస్టారెంట్‌లో లైవ్ మ్యూజిక్ కార్యక్రమం నడుస్తుంది.. ఆ పాటలు విన్నందుకు అదనంగా 8 పౌండ్లు బిల్‌లో చేర్చారు.. వీరు మొత్తం నలుగురు వెళ్లారు కాబట్టి.. ఒక్కొక్కరికి 8 పౌండ్ల చొప్పున 32 పౌండ్లు వడ్డించారు. చేసేది ఏమీ లేక.. ఆ బిల్ పే చేసినా.. సదరు ఆ బిల్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేసి.. ఏమిటీ విడ్డూరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. దీంతో.. ఆ బిల్ కాస్తా వైరల్‌గా మారిపోయింది..
ఇక, మా రెస్టారెంట్‌లో ప్రతి రాత్రి సంగీతం ఉంటుంది.. సంగీతం ప్లే అవుతున్నప్పుడు ఒక వ్యక్తికి 8 పౌండ్ల చొప్పున ఛార్జీ ఉంటుందని మెనులో పేర్కొంది సదరు రెస్టారెంట్.. ఆ డబ్బు సంగీతకారుడుకి చేరింది. ఎవరూ ఫిర్యాదు చేయలేదు అని కూడా చెబుతున్నారు.. ఇక, లైవ్ మ్యూజిక్ వినడానికి ఛార్జీ చాలా సంవత్సరాలుగా ఉంది, కానీ, వారు సాధారణంగా డోర్ వద్ద ఆ డబ్బును వసూలు చేస్తారు. అయినప్పటికీ, ప్రజలు ఇప్పుడు నగదును తీసుకెళ్లడం లేదు కాబట్టి.. దానిని బిల్లుకు జోడించారు అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.. ఇది డోర్ కవర్ ఛార్జ్. బ్యాండ్ బాగున్నంత వరకు మరియు ఛార్జ్ ముందుగా ప్రకటించినంత వరకు నేను దానిని పెద్దగా పట్టించుకోని అని మరొకరు పేర్కొన్నారు.. మరికొందరు తమ సొంత బిల్లుపై ఆ చార్జీని గుర్తిస్తే చికాకు వస్తుందంటున్నారు.. సంగీతానికి ఛార్జీ ఉందని స్పష్టమైన సంకేతం లేకుంటే నేను దానిని పట్టించుకోను.. ఆర్డర్ చేసే ముందు వారు దీనిని బహిర్గతం చేయాలి ఇంకో వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.. ఇలా మొత్తంగా ఆ మ్యూజిక్ చార్జ్ మాత్రం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. మన దగ్గర కూడా ఇలాంటి వడ్డింపు వస్తుందేమో చూసుకోండి మరి..