గుబురుగా నల్లని గడ్డం పెంచి, తెల్లని పంచె కట్టి యంగ్ హీరో నాని “లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ జర్నీ…” అంటున్నాడు. అరె… డైలాగ్ బాగుందే… గెటప్ అదిరిందే! ఏ సినిమాలోదో? అనుకుంటే పొరబాటే! ‘మినిస్టర్ వైట్’ బ్రాండ్ కు నాని బ్రాండ్ అంబాసిడర్ గా అలా కనిపిస్తున్నారన్న మాట! లుంగీలు, పంచెలు, షర్ట్స్ ఉత్పాదనలో ‘మినిస్టర్ వైట్’ సాగుతోంది. ఈ బ్రాండ్ తో నాని కూడా పయనం సాగిస్తున్నారు. అందుకే ‘జీవితం అందమైన ప్రయాణం లాంటిది’ అంటున్నారు నాని. “పంచెని మడతెట్టి మాస్ గా కనిపిస్తే ఆ లుక్… అందులో ఓ కిక్…” ఉందనీ చెబుతున్నారాయన. నాని కారణంగా ఈ బ్రాండ్ కు ఎంత కిక్ వస్తుందో!
నాని గతంలోనూ కొన్ని యాడ్స్ లో కనిపించి మురిపించారు. ఈ సారి తెల్లని పంచెల్లో రంగు రంగుల షర్ట్స్ వేసుకొని అలరిస్తున్నారు. వరుస సినిమాలతో మురిపిస్తోన్న నాని బ్రాండ్ అంబాసిడర్ గానూ స్పీడు పెంచుతారేమో! ఇలా మరెన్ని బ్రాండ్స్ కు నాని అంబాసిడర్ అవుతారో చూడాలి.