కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (దక్షిణ భారత శాఖ) ఆధ్వర్యంలో చెన్నైలో నేడు, రేపు జరుగబోతున్న సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘ప్రాంతీయం కొత్త జాతీయం’ రిపోర్ట్ ను ఆవిష్కరించారు. ‘కళ అంటే కేవలం వినోదమే కాదు, గుట్కా, గంజాయి దురాచారాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రగతిశీల ఆలోచనల ఆధారంగా సామాజిక దురాచారాలను ఎత్తి చూపడమే కళ’ […]
సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత, కథకుడు బాలయ్య మృతికి దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ”ప్రముఖ తెలుగు సినిమా నటుడు శ్రీ బాలయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. ఉన్నత సంప్రదాయాలను పాటిస్తూ ఉత్తమ నటుడిగా పేరు సంపాదించుకున్న మంచి మనిషి ఆయన. శ్రీ బాలయ్య గారు నటుడిగానే గాక నిర్మాతగా, దర్శకునిగా అనేక మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న పీరియడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ సందడి మెల్లగా మొదలయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. పవన్ కళ్యాణ్ తో ఇంతకు ముందు ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఎ.ఎమ్.రత్నం సమర్పణలో రూపొందుతోన్న ‘హరి హర వీరమల్లు’కు సంబంధించిన స్టిల్స్ కొన్ని ఇటీవల హల్ చల్ చేశాయి. తాజాగా సదరు పిక్స్ లోని యాక్షన్ మూవ్ మెంట్స్ తో ఓ వీడియో […]
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే శనివారం మరోసారి ఆ విషయాన్ని చిత్ర బృందం ఖరారు చేసింది. ఇదిలా ఉంటే… ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 12న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించిన ఈ మూవీని అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ తెరకెక్కించాడు. నిరంజన్ […]
(ఏప్రిల్ 9తో ‘కలెక్టర్ గారి అబ్బాయి’కి 35 ఏళ్ళు) మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, ఆయన నటవారసుడు నాగార్జున కలసి నటించిన చిత్రాలలో తొలి సూపర్ హిట్ గా నిలచిన చిత్రం ‘కలెక్టర్ గారి అబ్బాయి’. బి.గోపాల్ దర్శకత్వంలో ఏయన్నార్ పెద్ద అల్లుడు యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ‘కలెక్టర్ గారి అబ్బాయి’ 1987 ఏప్రిల్ 9న విడుదలయి, విజయఢంకా మోగించింది. ‘కలెక్టర్ గారి అబ్బాయి’ కథ ఏమిటంటే – రమాకాంతరావు అనే కలెక్టర్ నీతి, నిజాయితీలే ప్రాణంగా జీవిస్తూ […]
(ఏప్రిల్ 9న ‘డాక్టర్ – సినీయాక్టర్’కు 40 ఏళ్ళు) తాను అభిమానించే వారినే ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటారు. ఓ దశకు వచ్చాక వారితోనే పోటీపడాలనీ ఆశిస్తారు. ఎందుకంటే, తన ఆదర్శమూర్తితో తాను సరితూగాలని ప్రతి అభిమానికీ అభిలాష ఉంటుంది. అలాంటి కోరికతోనే హీరో కృష్ణ చిత్రసీమలో అడుగు పెట్టారు. చిన్నతనంలో తాను ఎంతగానో అభిమానించిన మహానటుడు యన్టీఆర్ తో కలసి నటించారాయన. ఆ సంతోషం చాలక, రామారావు సినిమాలు విడుదలయ్యే సమయంలోనే తన చిత్రాలనూ రిలీజ్ చేసి […]
(ఏప్రిల్ 9తో ‘ఘరానామొగుడు’కు 30 ఏళ్ళు) మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో అనేక చిత్రాలు విజయదుందుభి మోగించాయి. అసలు చిరంజీవి కెరీర్ ను పరిశీలిస్తే రాఘవేంద్రరావు సినిమాలతోనే ఆయనకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘మోసగాడు’. అందులో చిరంజీవి విలన్ గా నటించినా, డాన్సులతో మంచి మార్కులు పోగేశారు. తరువాత యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘తిరుగులేని మనిషి’లోనూ ఓ కీలక పాత్రలో […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ ‘అల…వైకుంఠపురములో’ అయితే, సక్సెస్ తో పాటు బెస్ట్ పెర్ ఫార్మర్ గా బన్నీకి పేరు తెచ్చిన చిత్రం ‘పుష్ప : ద రైజ్’ అనే చెప్పాలి. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప: ద రూల్’ రాబోతోంది. తొలి భాగంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నటించిన ఫహద్ ఫాజిల్ కు పుష్ప పాత్రధారి అల్లు అర్జున్ బట్టలు ఊడతీయించి పంపుతాడు. ఆ తరువాత ఏమవుతుంది? అదే […]
వరుణ్ తేజ్ ‘గని’ మూవీ శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వరుణ్ కు, ‘గని’ చిత్ర బృందానికి విషెస్ చెప్పింది సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. మామూలుగా అయితే… ఇందులో పెద్దంత ప్రత్యేక ఏమీ లేదు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్యలో సమ్ థింగ్ సమ్ థింగ్ సాగుతోందనే పుకారు షికారు చేస్తోంది. ‘అందాల రాక్షసి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అయోధ్య భామ… వరుణ్ తేజ్ సరసన తొలిసారి ‘మిస్టర్’ […]
‘బాహుబలి’ సినిమాతో ఓవర్ నైట్ పాపులారిటీని పొందిన ప్రభాకర్ ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. తాజాగా అతను ప్రధాన పాత్రధారిగా ఆర్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై గురువారం ఫిల్మ్ నగర్ లోని దైవసన్నిధానంలో ఓ సినిమా ప్రారంభమైంది. పాలిక్ దర్శకత్వంలో రావుల రమేశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు, నటుడు వై. కాశీ విశ్వనాథ్ క్లాప్ ఇవ్వగా, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్చాన్ […]