తన ‘డేంజరస్’ సినిమాను ఆపటానికి నట్టి క్రాంతి, నట్టి కరుణ కుట్ర పన్ని ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్ తో రిలీజ్ ను అడ్డుకున్నారు. ఇప్పుడు క్రింద కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ని తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. నట్టి క్రాంతి, నట్టి కరుణతో పాటు మీడియాలో నా పై వేసిన నిందలు, చేసిన ఆరోపణలకు నట్టి కుమార్ మీద నేను,తుమ్మలపల్లి రామత్యనారాయణ పరువు నష్టం దావా కేసు వెయ్యటమే కాకుండా రిలీజ్ కి ముందు ఫోర్జరీ డాక్యుమెంట్ ని ఉపయోగించి సినిమాని ఆర్థిక నష్టం కలిగించినందుకు డేమేజ్ కేసు వెయ్యబోతున్నాము. క్లియరెన్స్ ఆర్డర్ వచ్చింది కనుక ‘డేంజరస్’ చిత్రాన్ని May 6 న విడుదల చెయ్య బోతున్నాము. సెన్సార్ సర్టిఫికెట్ కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము. ఇక ఈ విషయంపై ఇంకా ఏమీ మాట్లాడను. జస్ట్ వాళ్ల పైన చట్టపరమైన చర్యల కోసం దృష్టి పెడతాను. అతి త్వరలో వాళ్ల అసలు రూపం బయట పెడతాను.