ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతన్నాయి. పోలింగ్ బూతులకు ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ భారీగా నమోదవుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు సంగారెడ్డి జిల్లా 1. సంగారెడ్డిలో 61.13 శాతం పోలింగ్ నమోదు 2. పటాన్ చెరులో […]
రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పలువురు సీఎం కేసీఆర్‌తో పాటు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఇందుకోసం నేతలంతా తమ సొంత నియోజకవర్గాలకు పయనమయ్యారు. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం 9 గంటలకు తన స్వగ్రామం చింతమడకలో ఓటు వేయనున్నారు. అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్లోని జెడ్‌పీహెచ్ఎస్ పోలింగ్ బూతులో ఓటు వేస్తారు. కోరుట్లలో కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగ రావు, మెట్‌పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్, […]
EC Suspends Hyderabad Police Officers: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు అధికారులను బుధవారం ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఎమ్మెల్యే కొడుకుకు సహకరించినందుకే వారిపై సస్పెన్షన్ వేటు పడింది. వారు ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్, ఏసీపీ యాదగిరి, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ల. వివరాలు.. మంగళవారం రాత్రి ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ అపార్టుమెంటులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొడుకు జయసింహా ముఠా ఓటర్లకు డబ్బులు […]
Hyderabad: తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రేపు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలింగ్ శాతం పెంచేందుకు స్కూల్స్, కాలేజీలతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కూడా ఈసీ సెలవులు ప్రకటించింది. అలాగే రేపు నగరంలోని పార్కులు కూడా మూతపడనున్నాయి. రేపు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పార్కులు బంద్ కానున్నాయి. జంట నగరాలలోని అన్ని పార్కులు మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. రేపు పోలింగ్ సందర్భంగా […]
Bandi Sanjay Release Note: రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ నియోజవర్గంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా బండి సంజయ్ సంచలన ప్రకటన ఇచ్చారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను సవాలు చేస్తూ బండి అనూహ్యంగా లేఖ విడుదల చేశారు. ‘గంగుల.. నీ సవాల్‌కు నేను రెడీ. భాగ్యలక్ష్మి వద్దకు కేసీఆర్‌ను రమ్మను. కరీంనగర్‌లో ఏ దేవాలయానికి రమ్మన్నా వచ్చేందుకు నేను సిద్ధం. డబ్బులు పంచలేదని […]
దీక్ష దీవాస్ పేరుతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత సీఈఓకు ఫీర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న కేటీఆర్ దీక్ష దివాస్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే.. అందుకే సీఈఓకి ఫిర్యాదు చేశామన్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా? అనే అనుమానం కలుగుతోంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి సైలెన్స్ పిరియాడ్ కొనసాగుతోంది. ఎన్నికలకు సంబంధించి […]
బాన్సువాడ బీజేపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఇంటిపై బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడుతో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ. రాత్రి నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించి బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యులతో పాటు, డ్రైవర్‌పై దాడి చేసి భయాందోళన సృష్టించి ఎన్నికలలో గెలవాలని చూడడం పిరికిపందల చర్య అన్నారు. ఓటమి భరించలేక దాడులకు తెగబడుతున్న బీఆర్ఎస్ గుండాల్లారా మీ ఆటలు ఇక సాగవు […]
బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణపై దాడిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ నేత డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. బాన్సువాడ క్యాంపు కార్యాలయంలో నిద్రిస్తున్న యెండల లక్ష్మి నారాయణతో పాటు కార్యకర్తలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది బీఆర్ఎస్ గుండాలపనే అని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో ఆయనపై జరిగిన దాడిపై తాజాగా కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యాలయాన్ని విధ్వంసం చేయడంతో పాటుగా లక్ష్మీనారాయణ గారి డ్రైవర్‌పై భౌతికదాడులకు […]
Rain Alert to Telangana: తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య భారతదేశంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సర్వం సిద్ధమవుతున్న క్రమంలో రాష్ట్రానికి వాతావరణ కేంద్రం వర్ష సూచన ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుందని కేంద్ర వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. Also […]
Telangana Elections: రేపు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఊర్లకు బయలుదేరుతున్నారు. ఎక్కువగా యువత ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్‌స్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని జూబ్లీబస్ స్టాండ్, ఎంజీబీఎస్‌లు జనాలతో నిండిపోయాయి. విద్యా, ఉపాధి, ఉద్యోగాల కోసం హైద్రాబద్ వచ్చిన వారంత ఓటు హక్కు మా బాధ్యత అంటూ సొంత ఊర్లకు పయనమవుతున్నారు. అయితే తగిన బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. […]