Indian tanker: అనుమతి ఇచ్చి, కాల్పులు జరపడమేంటి..? భారత్ నౌకపై ఇరాన్ కాల్పులు..
- భారత నౌకలపై ఇరాన్ కాల్పులు..
- అనుమతి ఇచ్చిన తర్వాత దాడి..
- వెలుగులోకి వచ్చిన పైలట్ మెసేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian tanker: హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న 2 భారతీయ నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత జెండా కలిగిన చమురు ట్యాంకర్లపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సిబ్బంది కాల్పులు జరపడంతో ఆ నౌకలు తమ మార్గాన్ని మార్చుకున్నాయి. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్ లోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. భారత్ తిరిగి వచ్చే నౌకలకు సురక్షిత మార్గాన్ని త్వరగా కల్పించాలని ఇరాన్ రాయబారిని కోరింది.
Read Also: Silver Purity: పాపం తెలుసా.. వెండి కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారంట! ఎలాగో తెలుసా?
Also Read
ఇదిలా ఉంటే, భారతీయ నౌకలకు ముందుగా ఇరాన్ అధికారులు ఇచ్చారని తెలుస్తోంది. అనుమతులు ఇచ్చినా కూడా కాల్పులు జరపడంపై నౌకా కెప్టెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సెపా నేవీ! సెపా నేవీ! ఇది సన్మార్ హెరాల్డ్ అనే మోటార్ ట్యాంకర్, మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు, మీ జాబితాలో నా పేరు రెండవది, మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు, మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు, నన్ను వెనక్కి తిరగనివ్వండి,” అని ఆందోళనతో తన మెసేజ్ పంపించారు. సంఘటన సమయంలో నౌకలో ఇరాక్ నుంచి వస్తున్న చమురు 20 లక్షల బ్యారెళ్లు ఉందని అధికారులు తెలిపారు. ఖేష్మ్, లారాక్ దీవుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలిసింది.
మరోవైపు, హార్ముజ్ మళ్లీ మూసేస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మెసేజ్‌లను హార్ముజ్ జలాల్లోని నౌకలన్నీ అందుకున్నాయి. చర్చల విషయంలో అమెరికా నిబద్ధతతో వ్యవహరించడం లేదని ఇరాన్ ఆరోపించింది. ఏ రకమైన, ఏ దేశానికి చెందిన నౌక కూడా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించమని చెప్పారు.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!