Telangana Elections: రేపు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఊర్లకు బయలుదేరుతున్నారు. ఎక్కువగా యువత ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్‌స్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని జూబ్లీబస్ స్టాండ్, ఎంజీబీఎస్‌లు జనాలతో నిండిపోయాయి. విద్యా, ఉపాధి, ఉద్యోగాల కోసం హైద్రాబద్ వచ్చిన వారంత ఓటు హక్కు మా బాధ్యత అంటూ సొంత ఊర్లకు పయనమవుతున్నారు. అయితే తగిన బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బస్సుల్లో సీట్స్ ఫుల్ కావడంతో ప్రియాణికులు నిల్చుని మరి ప్రయానిస్తూ ఊర్లకు చేరుకుంటున్నారు. దీంతో రెగ్యులర్ బస్‌లతో పాటు ఎన్నికల కోసం ఉత్తర తెలంగాణ జిల్లాలకు రిజర్వేషన్‌ల సంఖ్య పెరిగిందని ఆర్టీసీ పేర్కొంది. కాగా ఎన్నికల నేపథ్యంలో నేడు, రేపు విద్యాసంస్థలు సెలవు ఇవ్వడంతో విద్యార్థులు సైతం ఇంటిబాట పడుతున్నారు.