Rohit Sharma spotted at Hospital in Mumbai: ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య యూఏఈతో బుధవారం తలపడేందుకు భారత జట్టు సిద్ధమవుతుండగా.. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆసుపత్రికి వెళ్లాడు. సోమవారం అర్ధరాత్రి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి హిట్‌మ్యాన్ వెళ్లాడు. రోహిత్ ఆసుపత్రిలోకి ప్రవేశించే సమయంలో రిపోటర్స్ ఫోటోగ్రాఫర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోహిత్ శర్మ అర్ధరాత్రి కోకిలాబెన్ ఆస్పత్రికి వెళ్లడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. ఆస్పత్రి వద్ద ఉన్న వీడియో వైరల్ కావడంతో హిట్‌మ్యాన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. రోహిత్ ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారా? అని ఫాన్స్ ఆందోళనలో ఉన్నారు. రోహిత్ ఇటీవల గణపతి పూజలో కనిపించాడు. ఆగస్టు 30, 31 తేదీల్లో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తన ఫిట్‌నెస్ పరీక్షను క్లియర్ చేశాడు.
Also Read: Asia Cup 2025: గిల్ చిన్నప్పటి నుంచి తెలుసు.. నేను గుర్తున్నానో లేదో: యూఏఈ బౌలర్
రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తరపున తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లో ఆడాల్సి ఉండగా.. అది రద్దయింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో హిట్‌మ్యాన్ ఆడనున్నాడు. అక్టోబర్ 19, 23, 25 తేదీలలో మూడు వన్డేలు జరగనున్నాయి. రోహిత్ టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు హిట్‌మ్యాన్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
Rohit Sharma spotted in Kokilaben hospital Mumbai.❤️ pic.twitter.com/bQ6zTuixGc
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 8, 2025