Afghanistan’s ODI World Cup 2023 Semi Final Scenario : ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే భారత్ అధికారిక సెమీస్ బెర్త్ దక్కించుకోగా.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్ల నిష్క్రమణ కూడా ఖాయం. సెమీస్‌లోని మూడు బెర్తుల కోసం 5 జట్ల మధ్య పోటీ నెలకొంది. 12 పాయింట్స్ ఉన్న దక్షిణాఫ్రికాకు ఓ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. మరో మ్యాచ్ గెలిస్తే […]
Kane Williamson back in Zealand vs Pakistan Match: వన్డే ప్రపంచకప్ 2023లో నేడు కీలక పోరు ఆరంభం అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సెమీస్ బెర్త్ ఆశిస్తున్న న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ ఓ మార్పుతో బరిలోకి దిగుతోంది. ఉసామా మీర్ స్థానంలో హసన్ అలీ ఆడుతున్నాడు. మరోవైపు కివీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. […]
India Playing 11 vs South Africa in ODI World Cup 2023: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఏడు విజయాలు సాధించిన టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. లీగ్ దశను అగ్రస్థానంతో ముగించాలని చూస్తున్న భారత్.. తదుపరి జరిగే మ్యాచ్‌లో పటిష్ట దక్షిణాఫ్రికాతో తలపనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. భారీ విజయాలతో […]
Hardik Pandya Ruled Out Of ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ప్రపంచకప్ 2023లోని మిగతా మ్యాచ్‌లకు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. చీలమండ గాయం నుంచి ఇంకా కోలుకొని హార్దిక్.. మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో పేసర్ ప్రసిధ్ కృష్ణ భారత జట్టుకు ఎంపికయ్యాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు ప్రసిధ్ […]
Mohammed Shami’s ball on head gesture is for India Bowling Coach: టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ వన్డే ప్రపంచకప్ 2023లో చెలరేగుతున్న విషయం తెలిసిందే. బుల్లెట్ బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లో ఏకంగా 14 వికెట్స్ పడగొట్టాడు. ఇందులో రెండుసార్లు 5 వికెట్ల ప్రదర్శన ఉండడం విశేషం. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టి.. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్స్ పడగొట్టిన భారత బౌలర్‌గా ఆల్‌టైమ్ రికార్డు […]
ODI World Cup 2023 Semi Final Scenario: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా క్రికెట్ అభిమానులకు నేడు డబుల్ ధమాకా ఉంది. నేడు రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. శనివారం ఉదయం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడనుండగా.. మధ్యాహ్నం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. సెమీస్ రసవత్తరంగా మారిన నేపథ్యంలో నేటి రెండు మ్యాచ్‌లు కీలకంగా మారాయి. రెండు మ్యాచ్‌లు కూడా అభిమానులకు మంచి […]
Pat Cummins Feels ICC should allowe bigger squads in World Cups: వన్డే ప్రపంచకప్ సుదీర్ఘంగా సాగే టోర్నీ అని, ఒక్కో జట్టుకు 15 మంది ఆటగాళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం సరికాదని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ వ్యవధిని దృష్టిలో ఉంచుకుని.. ఒక్కో జట్టు 15 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లను తీసుకునేలా అనుమతించాలని ఐసీసీని కోరాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ప్రపంచకప్ కోసం ఒక్కో జట్టు 15 మంది […]
Gold and SIlver Price Today in Hyderabad on 4th November 2023: గత కొన్నిరోజులుగా బంగారం ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకీ పెరగడమే తప్ప.. తగ్గడం లేదన్నట్లు దూసుకుపోతున్నాయి. దాంతో పసిడి ధరలు 62 వేలకు చేరువైంది. శుక్రవారం పెరిగిన బంగారం ధరలు నేడు అదే బాటలో నడిచాయి. బులియన్ మార్కెట్లో శనివారం (నవంబర్ 4) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 […]
Rishabh Pant, Axar Patel Visits Tirupati Balaji Temple Today: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఈ ఇద్దరు స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తితిదే ఆలయ అధికారులు పంత్, అక్షర్‌కి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి.. స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం […]
Ambati Rayudu Hails Yuvatha-Haritha programme in AP: సాంస్కృతిక రాజధాని రాజమండ్రి నగరంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో హరిత నగరాన్ని తలపిస్తోందని, అద్భుత నగరంగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యువత-హరిత’ కార్యక్రమానికి రాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమండ్రి తిలక్ రోడ్లో నూతనంగా నిర్మించిన డివైడర్లలో ఎంపీ భరత్‌తో కలిసి […]