Kane Williamson back in Zealand vs Pakistan Match: వన్డే ప్రపంచకప్ 2023లో నేడు కీలక పోరు ఆరంభం అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సెమీస్ బెర్త్ ఆశిస్తున్న న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ ఓ మార్పుతో బరిలోకి దిగుతోంది. ఉసామా మీర్ స్థానంలో హసన్ అలీ ఆడుతున్నాడు. మరోవైపు కివీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. మాట్ హెన్రీ స్థానంలో ఇష్ సోధీ, విల్ యంగ్ స్థానంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి వచ్చారు.
బొటనవేలి గాయం కారణంగా గత నాలుగు మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ కేన్ విలియమ్సన్ తిరిగి జట్టుతో కలవడం న్యూజిలాండ్‌కు శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే.. కివీస్ సెమీస్ చేరాలంటే నేటి మ్యాచ్‌లో విజయం సాదించాల్సిందే. కేన్ మామ కెప్టెన్సీ, అనుభవం ఈ మ్యాచ్‌లో ఉపయోగపడనుంది. మరోవైపు సెమీ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో పాక్ తప్పక గెలవాల్సిందే. బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ దూకుడుగా ఆడుతోంది. 7 ఓవర్లలో 47 రన్స్ చేసింది.
తుది జట్లు:
పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఫకార్ జమాన్, బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్, సౌద్ షకీల్, ఆఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, హారిస్ రౌఫ్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్.