Every 5 minutes One Hyundai Creta is sold in India: భారత ఆటో మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోంది. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగానికి క్రెటా ‘కింగ్’ అని కూడా చెప్పొచ్చు. లగ్జరీ లుకింగ్, మైలేజ్, సేఫ్టీ లాంటి ప్రయోజనాలు ఉండటంతో జనాలు ఎక్కువగా క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం భారత మార్కెట్లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. దాంతో హ్యుందాయ్ ఇండియా కొత్త మైలురాయిని అందుకుంది. […]
Nikhil Siddhartha, Pallavi blessed with a Baby Boy: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ తండ్రయ్యాడు. నిఖిల్ సతీమణి పల్లవి బుధవారం ఉదయం పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియాలో తెలిపాడు. నిఖిల్ తన కుమారుడిని ఎత్తుకుని.. ముద్దాడుతున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అయింది. అభిమానులు, సినీ సెలెబ్రిటీలు హీరో నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2020లో డాక్టర్ పల్లవిని నిఖిల్ సిద్దార్థ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020 […]
FIR against Khalistani terrorist Gurpatwant Singh Pannu: భారత్, ఇంగ్లండ్ మధ్య రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్లు ఇప్పటికే రాంచీ చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టాయి. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి బెదిరింపులు వచ్చాయి. నాలుగో టెస్టు మ్యాచ్‌ను అడ్డుకోవాలని ఆయన సీపీఐ దళాన్ని కోరారు. ఈ మేరకు పన్నూ తన సోషల్ మీడియాలో […]
Yuvraj Singh likely to Join BJP ahead of Lok Sabha Elections 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలని బీజేపీ చూస్తోంది. 400కు పైగా సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఎన్డీఏ కూటమి బరిలోకి దిగుతోంది. లోక్‌సభ ఎన్నికలపై ఇటీవలే బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు రాష్ట్రాల్లో చేరికలపై దృష్టిపెట్టారు. నేమ్, ఫేమ్ ఉన్న సెలబ్రెటీలను పార్టీలో చేర్చుకునేందుకు […]
Abhishek Sharma to be interrogated in Tania Singh suicide: పంజాబ్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ చిక్కుల్లో పడ్డాడు. సూరత్‌కు చెందిన మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో అభిషేక్‌కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రముఖ మోడల్ తానియా సింగ్ ఇటీవల లేటు రాత్రి ఇంటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు అతడికి నోటీసులు పంపారు. తానియా సింగ్ […]
Stop putting your wet Apple iPhone in Rice Bag: ‘స్మార్ట్‌ఫోన్’ నీటిలో పడితే.. మనకు తెలిసిన పద్దతి ఒకటే. నీటిలో పడిన స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే తుడిచేసి.. ఇంట్లో ఉండే బియ్యం సంచిలో పెడుతాం. ఓ రోజంతా బియ్యం సంచిలో ఉంచిన తర్వాత తీసి ఛార్జింగ్ పెడుతుంటాం. అయితే ఇలా చేయడం వల్ల ఫోన్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని ‘యాపిల్’ కంపెనీ పేర్కొంది. నీటిలో పడిన ఐఫోన్‌ను బియ్యం సంచిలో పెట్టొద్దని యూజర్లకు యాపిల్ […]
Rahul Gandhi’s Bharat Jodo Nyay Yatra On Break: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఐదు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు. కీలక సమావేశాల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 2న […]
Anushka Sharma, Virat Kohli become parents to Baby Boy Akaay: సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క మగ బిడ్డకు జన్మనిచ్చిందని విరాట్ మంగళవారం ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపాడు. అంతేకాదు విరుష్క దంపతులు తమ బిడ్డకు అకాయ్‌గా నామకరణం చేశారు. విషయం తెలిసిన క్రీడా, సినీ ప్రముఖులు, అభిమానులు కోహ్లీ-అనుష్క జోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న […]
Bihar Road Accident Today: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం తెల్లవారుజామున రామ్‌గఢ్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖిసరాయ్ సమీపంలోని ఝూల్నా గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న టెంపోను రాంగ్ సైడ్ […]
Prithviraj Sukumaran’s The Goat Life Movie to Release on March 28: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా, అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఈ సినిమాను బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ […]