Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Nz 2nd Test Ravichandran Ashwin Becomes The Leading Wicket Taker In Wtc History

R Ashwin Record: చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్‌.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా రికార్డు!

NTV Telugu Twitter
Published Date :October 24, 2024 , 12:49 pm
By Sampath Kumar
  • రవిచంద్రన్ అశ్విన్‌ చరిత్ర
  • డ‌బ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు
  • 39 టెస్టుల్లో 188 వికెట్లు
R Ashwin Record: చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్‌.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా రికార్డు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీమిండియా వెటరన్ స్పిన్న‌ర్ రవిచంద్రన్ అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డ‌బ్ల్యూటీసీ)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యాష్ రికార్డుల్లోకెక్కాడు. పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్‌ రెండు వికెట్స్ పడగొట్టడంతో ఈ రికార్డు సొంతమైంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అశ్విన్.. ఇప్ప‌టి వ‌ర‌కు డ‌బ్ల్యూటీసీ మ్యాచుల్లో 188 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ జాబితాలో ఇప్పటి వరకు తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ (187)ను ఆర్ అశ్విన్ అధిగమించాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేసర్లు పాట్ కమిన్స్ (175), మిచెల్ స్టార్క్‌ (147) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్టువర్ట్ బ్రాడ్ (134) ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-5లో ముగ్గురు ఆసీస్‌ ప్లేయర్లే కావడం గమనార్హం. 2019లో డబ్ల్యూటీసీని ఐసీసీ ప్రారంభించగా.. 39 టెస్టులు ఆడిన అశ్విన్ 188 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 11 సార్లు 5 వికెట్లు సాధించాడు. లైయన్ 43 టెస్టుల్లో 187 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Tecno Pova 6 Neo: ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ ఆఫర్.. 12 వేలకే ‘టెక్నో పోవా 6 నియో’!

ఈ టెస్టులో ఆర్ అశ్విన్ తన తొలి ఓవర్‌లోనే వికెట్ సాధించాడు. యాష్ అద్భుతమైన బంతికి కివీస్ కెప్టెన్ టామ్‌ లాథమ్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. టెస్టుల్లో లాథమ్‌ను అశ్విన్ 9 సార్లు ఔట్ చేయడం విశేషం. విల్ యంగ్‌ వికెట్‌ను రివ్యూలో దక్కించుకున్నాడు. లెగ్‌ సైడ్ దిశగా వేసిన బంతిని యంగ్ షాట్‌కు యత్నించి.. కీపర్ రిషబ్ పంత్ చేతికి చిక్కాడు. భారత ఫీల్డర్లు అప్పీలు చేసినా.. ఫీల్డ్ అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు. డీఆర్‌ఎస్‌ తీసుకోమని కెప్టెన్ రోహిత్ శర్మను సర్ఫరాజ్‌ ఖాన్ కోరాడు. రోహిత్ సమీక్షకు వెళ్లగా.. రిప్లేలో ఔట్‌ అని తేలింది. దాంతో సర్ఫరాజ్‌పై ప్రశంసలు కురిసాయి. కివీస్ ప్రస్తుతం 39 ఓవర్లలో 2 వికెట్స్ నష్టానికి 127 రన్స్ చేసింది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashwin WTC Record
  • Ashwin WTC Wickets
  • ind vs nz
  • ind vs nz 2nd test
  • ravichandran ashwin

తాజావార్తలు

  • Raw Garlic : ఈ సమస్యలతో బాధపడేవారు.. ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే డాక్టర్‌తో పని లేదు !

  • Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!

  • PM Modi: నేడు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

  • AV Infra Fraud Case: ఏవీ ఇన్‌ఫ్రా భారీ మోసం.. 200 కోట్ల స్కామ్‌ సూత్రధారుడు సీఎండీ విజయ్ అరెస్ట్

  • Thammudu : ‘త‌మ్ముడు’ మూవీలో నితిన్ మేన‌కోడ‌లిగా న‌టించిన చిన్నారి ఎవరో తెలుసా..!

ట్రెండింగ్‌

  • TECNO Spark Go 2: మొబైల్‌లో సిగ్నల్ లేకున్నా పనిచేసే ఫీచర్‌.. కేవలం రూ. 6,999కే వచ్చేసిన ‘స్పార్క్ గో 2’ మొబైల్..!

  • Girl Friend Scam: ఇదేందయ్యా ఇది.. ఇంటి కోసం ఏకంగా 20 మంది అబ్బాలను ముగ్గులోకి దింపేసిందిగా..!

  • Vitamin D Foods: మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ D ఎలా తోడ్పడుతుందంటే..?

  • BSNL Launches Quantum 5G FWA: 5G విప్లవానికి నాంది.. బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G FWA సేవలు రూ.999 నుంచే ప్రారంభం..!

  • boAt Airdopes Prime 701 ANC: 50 గంటల ప్లేబ్యాక్‌, 46dB నాయిస్ క్యాన్సిలేషన్ తో వచ్చేసిన కొత్త ఇయర్‌బడ్స్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions