Former Maharashtra CM Manohar Joshi Dead: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూశారు. ఆయన వయసు 86. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని పీడీ హిందుజా ఆసుపత్రిలో చేరిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. మానోహర్ జోషికి వృద్యాప్య సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. మనోహర్ జోషి మరణ వార్తను పీడీ హిందూజా హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జాయ్ చక్రవర్తి ధృవీకరించారు. ఈరోజు మధ్యాహ్నం ముంబైలోని శివాజీ […]
MLA Lasya Nanditha Dies: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో కన్నుమూశారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఓఆర్ఆర్లోని సుల్తాన్ పూర్ వద్ద కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుకుని పరిశీలించారు. మేడ్చల్ నుంచి పటాన్చెరువు వస్తుండగా ఎమ్మెల్యే […]
IND vs ENG 4th Test Prediction: అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ఆరంభం కానుంది. 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. సొంతగడ్డపై వరుసగా 17వ సిరీస్ సాధించాలని చూస్తోంది. మరోవైపు సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. రాంచిలో బంతి బాగా తిరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో ఇరు జట్ల బ్యాటర్లు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారన్నదే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించనుంది. ఈ మ్యాచ్ జేఎస్సీఏ […]
BRS MLA Lasya Nanditha Dead: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద కారు అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. లాస్య నందిత వయసు 33. బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే మృతి పట్ల తెలంగాణ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న […]
iQOO Neo 9 Pro 5G Smartphone Launched in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘ఐకూ’ భారత మార్కెట్లో మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. నియో సిరీస్‌లో భాగంగా ‘ఐకూ నియో 9ప్రో’ని గురువారం భారతదేశంలో లాంచ్ చేసింది. ఐకూ 9 సిరీస్ గత డిసెంబర్ చివరిలో చైనాలో ప్రారంభమైంది. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 920 సెన్సర్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో ఔటాఫ్‌ది బాక్స్ ఆండ్రాయిడ్ […]
Yashasvi Jaiswal buys Rs 5.4 Crore Home in Mumbai: టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ వాణిజ్య రాజధాని ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడట. ఈస్ట్ బాంద్రాలో వింగ్ 3 ఏరియాలోని 1100 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్‌ను యశస్వి కొన్నాడట. దీని ధర దాదాపు రూ. 5.4 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 2024 జనవరి 7న జైస్వాల్ […]
Shah Rukh Khan to join WPL 2024 Opening Ceremony: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 23) బెంగళూరులో ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ప్రారంభ వేడుకను ఘనంగా ప్లాన్ చేసింది. ఓపెనింగ్ సెర్మనీ వేడుకకు బాలీవుడ్ హీరోలు […]
Ben Stokes on Ranchi Pitch: రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పిచ్‌ను పరిశీలించి ఆశ్చర్యపోయాడు. ఇంతకుముందు ఇలాంటి వికెట్‌ను ఎన్నడూ చూడలేదని, మ్యాచ్ జరిగే కొద్దీ ఎలా మారుతుందో చెప్పడం కష్టమని పేర్కొన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధిస్తే.. సిరీస్ రేసులో నిలుస్తుంది. […]
Will BCCI take action against Shreyas Iyer: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అడ్డంగా దొరికిపోయాడు. గాయం తిరగబెట్టిందని, వెన్నునొప్పి వస్తుందని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి వెళ్లిన శ్రేయాస్.. ఫిట్‌గా ఉన్నాడని తాజాగా తేలింది. శ్రేయాస్ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐకి ఎన్సీఏ వైద్య బృందం రిపోర్ట్ ఇచ్చింది. మ్యాచ్ ఆడే సామర్థ్యంతో అతడు ఉన్నాడని బీసీసీఐకి ఎన్సీఏ నివేదిక పంపింది. దాంతో శ్రేయాస్‌పై విమర్శలు మొదలయ్యాయి. […]
YouTuber Shanmukh Jaswanth Arrested in Drugs Case: ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయితో పట్టుపడ్డాడు. ఇంట్లో గంజాయి తీసుకుంటుండగా.. షణ్ముఖ్‌ను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్‌తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్‌ని కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు. అన్న కోసం వెళితే.. తమ్ముడు పోలీసులకు చిక్కడం ఇక్కడ విశేషం. షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది తొలిసారి కాదు. […]