Ex Wife and Husband contesting in Bishnupur: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ వారంలోనే షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తరుపున బెంగాల్ నుంచి పోటీ చేస్తున్న వారి పేర్లను తాజాగా సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. టీఎంసీ 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కొన్నిస్థానాల్లో అభ్యర్థుల ఎంపిక […]
Rahul Dravid React on Team India’s Six-Hitting vs England: శనివారం ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదవ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 4-1 తేడాతో రోహిత్ సేన కైవసం చేసుకుంది. భారత జట్టు తమ స్వదేశీ రికార్డును నిలబెట్టుకోవడంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశారు. అలానే ఈ సిరీస్‌లో భారత ప్లేయర్స్ బాగా సిక్సులు బాదారని ప్రశంసించారు. సిక్సర్లు […]
David Miller marries his girlfriend Camilla Harris: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి కెమిల్లా హారిస్‌ను మిల్లర్ ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న మిల్లర్, కెమిల్లాలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని కెమిల్లా ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను కెమిల్లా షేర్ చేశారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేప్ టౌన్ వేదికగా జరిగిన […]
Oppenheimer wins seven awards in Oscars 2024: ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ వేడుకకు ఎందరో సినీ తారలు హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఓపెన్‌హైమర్’కు అవార్డుల పంట పండింది. 13 నామినేషన్లతో వెళ్లిన ఓపెన్‌హైమర్.. 7 అవార్డులను […]
Phil Salt replaces Jason Roy at KKR: ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 నుంచి వైదొలిగాడు. దాంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ ఎదురుదెబ్బ తగిలింది. రాయ్ స్థానంలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. మరోవైపు కేకేఆర్ కూడా ఫిలిప్ సాల్ట్ జట్టులోకి వస్తున్నాడని ట్వీట్ […]
Delhi Capitals Women won by 1 run vs Royal Challengers Bangalore in WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ గెలుపొందింది. ఈ సీజన్లో ఢిల్లీకి ఇది ఐదో విజయం కాగా.. బెంగళూరుకు నాలుగో ఓటమి. 7 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఢిల్లీ ప్లేఆఫ్స్‌లో ప్రవేశించింది. […]
Robert Downey Jr Wins Best Supporting Actor for Oppenheimer: సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్‌ల వేడుక అట్టహాసంగా మొదలైంది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డ్‌ల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం హోస్ట్‌గా జిమ్మీ కిమ్మెల్ ఉన్నాడు. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ ‘ఒపెన్ హైమర్’ అత్యధిక నామినేషన్లతో (13) ఆస్కార్ అవార్డ్ 2024కు వచ్చింది. పూర్ థింగ్స్ (11), కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ […]
India complete 4-1 series: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిప్పేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 195 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ (84) హాఫ్ సెంచరీతో పోరాడగా.. జానీ బెయిర్‌స్టో (39) పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం అశ్విన్ 9 […]
తెలంగాణలోని జగిత్యాలలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రోటోకాల్ వివాదంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సముదయించారు. పోలీసులు కూడా ఇరు వర్గాలను చెదరగొట్టారు. Also Read: Ramanthapur SBI: రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం.. కోట్లు కొల్లగొట్టిన బ్యాంక్ మేనేజర్లు! శనివారం ఉదయం జగిత్యాల స్థానిక తహసీల్దార్ […]
హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం బయటపడింది. బ్యాంక్ మేనేజర్లు భారీ మోసానికి పాల్పడ్డారు. లక్ష కాదు రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.2.80 కోట్లు కాజేశారు. ఖాతాదారులకు తెలియకుండా.. వారి డాక్యుమెంట్లు తీసుకుని మేనేజర్లు ఘరానా మోసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో షేక్ సైదులు, గంగ మల్లయ్యలు రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో బ్యాంక్ మేనేజర్లుగా పని చేశారు. […]