WPL 2024: ఒక పరుగు తేడాతో బెంగళూరు ఓటమి.. ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Women won by 1 run vs Royal Challengers Bangalore in WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ గెలుపొందింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది ఐదో విజయం కాగా.. బెంగళూరుకు నాలుగో ఓటమి. 7 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఢిల్లీ ప్లేఆఫ్స్‌లో ప్రవేశించింది. ఏడాది ఢిల్లీ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ (29), షెఫాలీ వర్మ (23) తొలి వికెట్‌కు 54 పరుగులు చేశారు. స్వల్ప వ్యవధిలో లానింగ్, షెఫాలీ ఔటైనా.. ఢిల్లీ జోరు తగ్గలేదు. జెమీమా రోడ్రిగ్స్ (58; 36 బంతుల్లో 8×4, 1×6), అలీస్ క్యాప్సీ (48; 32 బంతుల్లో 8×4) చెలరేగారు. ఇద్దరు ఫోర్లు, సిక్స్‌లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. జెమీమా 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ అందుకుంది. జెమీమా అవుట్ కావడంతో ఢిల్లీ 200 స్కోరు చేయలేకపోయింది. బెంగళూరు బౌలర్ శ్రేయంక పాటిల్ (4/26) రాణించింది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
Also Read: Oscar Awards 2024: ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్!
భారీ ఛేదనలో బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ స్మృతి మంధాన (5) నిరాశపరిచింది. ఎలీస్ పెర్రీ (49; 32 బంతుల్లో 7×4, 1×6), సోఫీ మోలనూ (33; 30 బంతుల్లో 5×4) జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరు 10.5 ఓవర్లలో రెండో వికెట్‌కు 89 పరుగులు జత చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో పెర్రీ, మోలనూ ఔట్ అయ్యారు. వికెట్స్ పడినా సోఫీ డివైన్ (26), రిచా ఘోష్ (51; 29 బంతుల్లో 4×4, 3×6) ధాటిగా ఆడి బెంగళూరును వెనకబడిపోకుండా చూశారు. అయితే డివైన్ ఔట్ కావడంతో ఆర్‌సీబీకి గట్టి దెబ్బ తగిలింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే రిచా సిక్స్ బాదింది. తర్వాతి 3 బంతులకు 2 పరుగులే వచ్చాయి. అయిదో బంతికి రిచా సిక్స్ కొట్టడంతో చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి వచ్చింది. రిచా జోరు మీద ఉండడంతోఆర్‌సీబీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే చివరి బంతికి సరైన షాట్ ఆడని రిచా.. పరుగు తీసే క్రమంలో రనౌట్ అయింది. దాంతో ఢిల్లీ ఒక పరుగు తేడాతో గెలుపొందింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?