Oscar Awards 2024: ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robert Downey Jr Wins Best Supporting Actor for Oppenheimer: సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్‌ల వేడుక అట్టహాసంగా మొదలైంది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డ్‌ల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం హోస్ట్‌గా జిమ్మీ కిమ్మెల్ ఉన్నాడు. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ ‘ఒపెన్ హైమర్’ అత్యధిక నామినేషన్‌లతో (13) ఆస్కార్ అవార్డ్ 2024కు వచ్చింది. పూర్ థింగ్స్ (11), కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ (10) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
‘ఓపెన్ హైమర్’ ఈ సీజన్‌లో అత్యధిక అవార్డులను అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా ఉత్తమ నటుడి ట్రోఫీని ఆస్కార్ అవార్డ్ 2024లో సొంతం చేసుకుంటుందని అందరూ భావించారు. ఒపెన్ హైమర్‌లో తన నటనకు ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్ ఎంపికయ్యారు. ఇదే చిత్రంకు గాను ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో జెన్నిఫర్ లేమ్‌కు అవార్డు దక్కింది. పూర్ థింగ్స్ సినిమాకు గాను బెస్ట్ హెయిర్ స్టయిల్ అండ్ మేకప్ (నడియా స్టేసీ, మార్క్ కౌలియర్), ఉత్తమ కాస్టూమ్ డిజైన్ (హోలి వెడ్డింగ్‌టన్), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (జేమ్స్ ప్రైస్, షోనా హెత్) అవార్డులు వచ్చాయి. అవార్డుల కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన అవార్డుల జాబితా ఇదే.
Also Read
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ఆస్కార్ అవార్డ్స్ 2024 లిస్ట్:
# ఉత్తమ సహాయ నటుడు – రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
# ఉత్తమ సహాయ నటి – డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)
# బెస్ట్ హెయిర్ స్టయిల్ అండ్ మేకప్ – నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)
# బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్)
# బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
# బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – ది బాయ్ అండ్ ది హిరాన్
# ఉత్తమ కాస్టూమ్ డిజైన్ – హోలి వెడ్డింగ్‌టన్ (పూర్ థింగ్స్)
# బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్)
# ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
# ఉత్తమ ఎడిటింగ్ – జెన్నిఫర్ లేమ్ (ఓపెన్‌హైమర్)
# ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – గాడ్జిల్లా మైనస్ వన్
# ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) – ది లాస్ట్ రిపేర్ షాప్
తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!