Yuzvendra Chahal becomes first bowler to take 200 IPL wickets: రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో 200 వికెట్స్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్ నబీని ఔట్ చేయడంతో చహల్ ఖాతాలో రెండొందల వికెట్ చేరింది. ఐపీఎల్లో ఇప్పటివరకు 153 మ్యాచ్‌లు ఆడిన మణికట్టు స్పిన్నర్ చహల్.. 7.73 ఎకానమీతో 200 […]
Suresh Raina Slams RCB Over IPL Title: ఐపీఎల్లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదేసి టైటిల్స్ సాధించాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలవగా.. రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి టైటిల్ గెలిచాయి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సహా మూడేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఒక్క […]
Priyanka Chopra on Upcoming Documentary Tiger: ప్రకృతికి సంబంధించిన సినిమాలకు తాను పెద్ద అభిమానిని అని నటి ప్రియాంక చోప్రా జోనాస్ తెలిపారు. గళాన్ని (వాయిస్ ఓవర్) అందించాలనే తన కోరిక ‘టైగర్’తో నెరవేరిందని చెప్పారు. హాలీవుడ్, బాలీవుడ్లో రాణిస్తున్న ప్రియాంక.. త్వరలో విడుదల కానున్న టైగర్ అనే డాక్యుమెంటరీలో అంబా అనే ఆడపులి పాత్రకు తన గొంతు అరువిచ్చారు. ఏప్రిల్ 22న డిస్నీ+ హాట్‌స్టార్‌లో టైగర్ ప్రసారం ప్రారంభమవుతుంది. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన […]
Ram Charan’s Game Changer Movie Update: రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడడం లేదు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌కు […]
After 18 Years Suriya and Jyothika to act a movie: కోలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో సూర్య, జ్యోతిక జంట ఒకటి. రీల్ లైఫ్‌లో కలిసి నటించిన ఈ ఇద్దరు.. ప్రేమ వివాహం చేసుకొని రియల్ లైఫ్ దంపతులు అయ్యారు. పెళ్లికి ముందు సూర్య, జ్యోతికలు చాలా సినిమాల్లో నటించారు. 1999లో విడుదలైన ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’లో తొలిసారి కలిసి నటించారు. అనంతరం ఉయిరిలే కలందదు, పేరళగన్, కాక్క కాక్క, సిల్లన్ను ఒరు కాదల్, మాయావి లాంటి […]
Masooda Fame Thiruveer married Kalpana Rao: టాలీవుడ్ యువ హీరో తిరువీర్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రేయసి కల్పనా రావును ఆయన వివాహమాడారు. ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఆదివారం (ఏప్రిల్ 21) తిరుమల శ్రీవారి ఆలయంలో తిరువీర్, కల్పనా వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ‘కొత్త జీవితం ప్రారంభం’ అంటూ తన పెళ్లి ఫోటోలను తిరువీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు […]
RCB Captain Faf du Plessis on Virat Kohli’s Noball Dismissal: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వివాస్పద రీతిలో ఔట్ అయిన విషయం తెలిసిందే. హర్షిత్ రాణా వేసిన స్లో ఫుల్‌టాస్‌ను అంచనా వేయలేక.. బంతిని అక్కడే గాల్లోకి లేపగా బౌలర్ క్యాచ్ పట్టాడు. అంపైర్ అవుట్ ఇవ్వగా.. బంతి నడుం కంటే ఎక్కువ ఎత్తులో […]
ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. ఆర్సీబీ ఒకే రన్ చేసి ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. కోపంలో ఆన్ ఫీల్డ్ అంపైర్లపై నోరుపారేసుకున్నాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. విరాట్ వివాదస్పద రీతిలో అవుట్ […]
Indian Grandmaster D Gukesh makes history: భారత యువ చెస్ ప్లేయర్ డీ గుకేశ్ చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులో ‘క్యాండిడేట్స్’ విజేతగా నిలిచిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. కెనడా వేదికగా జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీ 2024లో గుకేశ్ టైటిల్ విజేతగా నిలిచాడు. క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో 17 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ గుకేష్.. 9/14 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే క్యాండిడేట్స్ […]
Virat Kohli makes history in IPL: ఇప్పటికే ఐపీఎల్లో అనేక రికార్డులను తన పేరుపై లిఖించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్లో ఒక జట్టు తరఫున 250 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్స్‌లు బాదిన కింగ్.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు […]