Thiruveer Marriage: ప్రేయసిని పెళ్లాడిన టాలీవుడ్ యువ హీరో.. ఫొటోస్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Masooda Fame Thiruveer married Kalpana Rao: టాలీవుడ్ యువ హీరో తిరువీర్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రేయసి కల్పనా రావును ఆయన వివాహమాడారు. ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఆదివారం (ఏప్రిల్ 21) తిరుమల శ్రీవారి ఆలయంలో తిరువీర్, కల్పనా వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ‘కొత్త జీవితం ప్రారంభం’ అంటూ తన పెళ్లి ఫోటోలను తిరువీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తిరువీర్ స్వస్థలం రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి. కెరీర్ ఆరంభంలో 150కి పైగా నాటకాల్లో నటించారు. ఆపై రేడియో జాకీగా పని చేశారు. ‘ఆర్జే తిరూ’ అంటూ శ్రోతలను పలకరించిన తిరువీర్.. ‘బొమ్మలరామారం’ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఘాజీ, ఏమంత్రం వేశావే, మల్లేశం, టక్ జగదీశ్ సినిమాలలో చిన్న పాత్రలు చేశారు. జార్జ్ రెడ్డిలో నెగెటివ్ రోల్, పలాస 1978లో సపోర్టింగ్ క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మసూద చిత్రంతో భారీ క్రేజ్‌ను సంపాదించారు. మసూద కమర్షియల్‍గానూ మంచి హిట్ కావడంతో హీరోగా నిలదొక్కుకున్నారు.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
Also Read: Virat Kohli-Noball: మనమేం చేయలేం.. కోహ్లీ ఔట్‌పై స్పందించిన డుప్లెసిస్!
గతేడాది ‘పరేషాన్’ చిత్రంతోనూ తిరువీర్ మెప్పించారు. తెలంగాణ బ్యాక్‍డ్రాప్‍లో వచ్చిన ఈ మూవీలో ఆయన యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంది. ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్‍లోనూ కీలకపాత్ర చేశారు. తిరువీర్ నటించిన మోక్షపట్నం, పారాహుషార్ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉంది. ఇక ఇటీవల హీరోగా సోషియో ఫాంటసీ చిత్రాన్ని ప్రకటించారు.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!