Suriya-Jyothika: 18 ఏళ్ల తర్వాత.. ఆఫ్‌స్క్రీన్, ఆన్‌స్క్రీన్ హిట్ జోడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
After 18 Years Suriya and Jyothika to act a movie: కోలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో సూర్య, జ్యోతిక జంట ఒకటి. రీల్ లైఫ్‌లో కలిసి నటించిన ఈ ఇద్దరు.. ప్రేమ వివాహం చేసుకొని రియల్ లైఫ్ దంపతులు అయ్యారు. పెళ్లికి ముందు సూర్య, జ్యోతికలు చాలా సినిమాల్లో నటించారు. 1999లో విడుదలైన ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’లో తొలిసారి కలిసి నటించారు. అనంతరం ఉయిరిలే కలందదు, పేరళగన్, కాక్క కాక్క, సిల్లన్ను ఒరు కాదల్, మాయావి లాంటి సినిమాలలో నటించారు. సూర్య, జ్యోతికల పరిచయం ప్రేమగా మారడంతో.. ఇరు కుటుంబాల అనుమతితో 2006లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు.
పెళ్లి అనంతరం సూర్య వరుస హిట్‌లతో దూసుకు పోగా.. జ్యోతిక మాత్రం నటనకు దూరమయ్యారు. ’36 వయదినిలే’ చిత్రంతో జ్యోతిక హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చారు. మమ్ముట్టికి జంటగా ‘కాదల్ ది కోర్’ అనే చిత్రంలో నటించారు. తాజాగా బాలీవుడ్‌లో అజయ్ దేవ్‌గన్ సరసన ‘సైతాన్’లో నటించారు. రీఎంట్రీలో సూర్యతో జతకట్టేందుకు జ్యోతిక సిద్ధమయ్యారని తెలుస్తోంది. బెంగుళూరు డేస్ ఫేమ్ అంజలి మేనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్య, జ్యోతికలు జంటగా నటించనున్నారట. ప్రస్తుతం వీరిద్దరితో చిత్ర బృందం చర్చలు జరుపుతోందట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇదే నిజమైతే దాదాపు 18 ఏళ్ల తరువాత సూర్య, జ్యోతిక మరోసారి జంటగా నటించనున్నారు.
Also Read
Also Read: Thiruveer Marriage: ప్రేయసిని పెళ్లాడిన టాలీవుడ్ యువ హీరో.. ఫొటోస్ వైరల్!
సూరరైపోట్రు, జై భీమ్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ప్రస్తుతం సూర్య ‘కంగువ’ సినిమాని పూర్తి చేశాడు. ఇటీవలే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో 44వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో మొదలు కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సైంధవ్ ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా పనిచేయబోతున్నాడు. పీరియాడిక్ వార్ అండ్ లవ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే సంక్రాతికి విడుదల కానుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!