Sampath Kumar
Author- NTV Telugu-
KTR: పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో గేదెల కోసం తీసుకున్న లోన్ కట్టలేదని డీసీసీబీ బ్యాంక్ అధికారులు ఇంటి గేటు పీక్కెళ్లిన విషయం తెలిసిందే. లోన్ చెల్లించలేదని రైతు ఇంటి గేటును ట్రాక్టర్ తీసుకొచ్చి మరి బ్యాంక్ అధికారులు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణం కట్టలేదని ఇంత […] -
Ponnam Prabhakar: రీసర్వే కాదు.. ఇది మిస్ అయిన వారి కోసం మాత్రమే!
రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా సర్వే చేశాం అని, మిస్ అయిన వారి కోసం మరో అవకాశం ఇస్తున్నాం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది రీసర్వే కాదని, ఇది మిస్ అయిన వారికోసం మాత్రమే అని స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ వారికి సర్వే గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. రాజకీయ విమర్శల కొసమే బీసీ ముస్లింల మీద బీజేపీ వారు విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్లోని మూడు పదవులలో […] -
Himayatnagar Robbery: హిమాయత్ నగర్లో భారీ చోరీ.. రెండు కోట్ల రూపాయల నగలు మాయం!
భాగ్యనగరంలో దోపిడీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దుండగులు భారీగా బంగారం, నగదును దోచుకెళ్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవలి రోజుల్లో వరుస చోరీలతో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా హిమాయత్ నగర్లో భారీ చోరీ జరిగింది. ఓ బంగారం వ్యాపారి ఇంట్లో భారీగా బంగారం, నగదు దోచుకెళ్లారు దొంగలు. వ్యాపారి లబోదిబోమంటూ హిమాయత్ నగర్ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలలం రేపింది. వివరాల ప్రకారం.. హిమాయత్ నగర్లో నివాసం ఉండే బంగారం వ్యాపారి […] -
MLC Kavitha: నేడు జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు పెంబర్తి గ్రామంలోని విశ్వకర్మ హస్తకళల కేంద్రంను కవిత సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేఖ రాజ్‌ను పరామర్శిస్తారు. ఉదయం 11.30కి పెంబర్తి గ్రామ్ పంచాయత్ కార్యాలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతారు. Also Read: Champions Trophy 2025: ఐదుగురు స్టార్స్ […] -
Champions Trophy 2025: ఐదుగురు స్టార్స్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఏకంగా ఐదుగురు స్టార్ ప్లేయర్స్ దూరమయ్యారు. గాయాల కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వైదొలగగా.. ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో స్టార్క్ టోర్నీకి దూరమయ్యాడు. కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో 15 మంది సభ్యుల జట్టులో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పలు మార్పులు చేసింది. గాయం కారణంగా […] -
Fire Accident: జనగామలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!
జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ రోడ్డులోని ‘జై భవాని’ హార్డ్ వేర్, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా.. ఫైర్ సిబ్బంది వెంటనే అలెర్ట్ అయింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని జనగామ పట్టణ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Also Read: Shubman […] -
Shubman Gill Record: ప్రపంచంలోనే మొదటి బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు!
టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. తన 50 వన్డే మ్యాచ్‌లో గిల్ ఈ మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హషీమ్ ఆమ్లా (53 ఇన్నింగ్స్‌ల్లో) రికార్డును బద్దలు కొట్టాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో గిల్ 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సులతో 112 రన్స్ బాదాడు. 2019 జనవరి […] -
MLC Kavitha: ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుంది!
ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నిన్న రాహుల్ గాంధీ వరంగల్‌కు రావాలి అనుకొని కూడా రాలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వరంగల్ ప్రజలు అడుగుతారఅని రాహుల్ రాలేదన్నారు. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ హామీలు నెరవేర్చే వరకు వెంటబడతాం అని హెచ్చరించారు. మార్చి 8న మహిళా శంఖారావం జరగబోతోందని, ఇందిరా పార్కు దగ్గర జరిగే ఈ మీటింగ్‌లో మహిళల సత్తా చాటుతాం అని కవిత […] -
Moinabad Farm House: 64 మందిని అరెస్ట్ చేశాం.. సొంత కార్లలో కోళ్లను తీసుకొచ్చారు: డీసీపీ
హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ గుట్టు రట్టయింది. క్యాసినో, కోడిపందేలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోడిపందేలతో పాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అరెస్ట్ చేశారు. ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం […] -
GHMC: పోటీ చేయాలా, వద్దా అనేది త్వరలో చెబుతాం: తలసాని
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై ఈ నెల 17 లోపు నిర్ణయం తీసుకుంటామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం అవుతారని చెప్పారు. బీసీ మూమెంట్ చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం బీసీ జనాభా చాలా తక్కువగా ఉందన్నారు. రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్ కూడా పాల్గొంటారని తలసాని చెప్పుకొచ్చారు. ఈనెల 25న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో మాజీమంత్రి తలసాని […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!