IND vs ZIM Playing 11: జోరుమీదున్న భారత్ మరో పోరుకు సిద్ధమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా నేడు జింబాబ్వే, భారత్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా.. రెండో టీ20లో పంజా విసిరింది. ఇక యువ భారత్‌ను ఆపడం ఆతిథ్య జట్టుకు కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే జట్టులోకి ప్రపంచకప్ విన్నర్స్ శివమ్ దూబె, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ చేరారు. […]
Redmi 13 5G Launch Date in India and Price: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ‘షావోమి’.. రెడ్మీ బ్రాండ్‌పై మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘రెడ్మీ 13 5జీ’ స్మార్ట్‌ఫోన్ మంగళవారం భారత్‌లో విడుదలైంది. ఇది సరికొత్త ఎంట్రీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌తో రూపొందిన ఈ ఫోన్ ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. షావోమి హైపర్ఓఎస్తో వస్తున్న తొలి రెడ్మీ ఫోన్ ఇదే కావడం విశేషం. డిజైన్ విషయంలో రెడ్మీ12 5జీని ఈ ఫోన్ […]
India New Head Coach Gautam Gambhir Salary: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జై షా అధికారికంగా వెల్లడించారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లు అన్ని దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం గౌతీని కోచ్‌గా ఎంపిక చేశారు. గంభీర్‌కు భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ […]
Gautam Gambhir Tweet After Elected as Team India Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ద్రవిడ్ వారసుడిగా గౌతీనే కోచ్ బాధ్యతలు అందుకుంటాడని ముందునుంచే ప్రచారం జరిగింది. అయితే భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ కూడా బీసీసీఐ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూకు హాజరైనా.. గంభీర్‌కే అందరూ ఓటేశారు. జులై చివరలో […]
Datathon Conference on ChatGPT in Telugu: తెలుగులో చాట్‌జీపీటీ తయారీకి అవసరమైన తెలుగు భాష డేటా సెట్స్ సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం, స్వేచ్ఛ సంస్థలు సంయుక్తంగా ఓ సదస్సును నిర్వహించనున్నాయి. బుధవారం (జులై 10) ‘డేటాథాన్’ సదస్సు నిర్వహించనున్నట్లు ఐటీ శాఖ ఓ ప్రకటలో తెలిపింది. వచ్చే సెప్టెంబరులో హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో భాగంగా డేటాథాన్ ఉంటుందని పేర్కొంది. తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్, టాస్క్, ఐఐఐటీహెచ్, వైల్ఓజోన్టెల్, డిజిక్వాంట, టెక్వేదిక సంస్థలు […]
Lion vs Tiger Viral Video: అడవికి ‘రారాజు’ సింహం. సింహంతో పోరాటం అంటే.. ఏం జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అందుకే సింహం కనిపించగానే అన్ని జంతువులూ పరార్ అవుతుంటాయి. మరోవైపు పులి కూడా తక్కువదేం కాదు. పులి ‘పంజా’ దెబ్బకు ఎంతటి బలమైన జంతువైనా కంగుతింటుంది. అలాంటి సింహం, పులి తలపడితే.. ఆ ఫైట్ ఎలా ఉంటుంది?, గెలుపు ఎవరిని వరిస్తుంది?, రెండింట్లో ఏది అత్యంత శక్తిమంతమైనది? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వీటన్నింటికి […]
Why BCCI is delaying India’s New Head Coach announcement: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగిసింది. వాస్తవానికి గత సెప్టెంబర్‌లోనే ద్రవిడ్ పదవి కాలం ముగియగా.. కెప్టెన్ రోహిత్ శర్మ విజ్ఞప్తితో టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాడు. ఇక త్వరలోనే కొత్త హెడ్ కోచ్‌ను బీసీసీఐ నియమించనుంది. జులై చివరలో శ్రీలంకతో ప్రారంభమయ్యే టీ20, వన్డేల సిరీస్‌లకు కొత్త కోచ్ అందుబాటులో ఉంటాడని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి […]
Case against Virat Kohli’s One8 Commune Pub: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ పబ్‌పై కేసు నమోదైంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా పబ్‌ను నిర్వహించినందుకు గాను బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి 1.30 గంటల వరకు తెరిచి ఉన్నందుకు బెంగళూరులోని వన్8 కమ్యూన్ మేనేజర్‌పై కేసు నమోదైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్‌తో పాటు […]
Singer Usha Uthup Husband Passed Away: ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త జాని చాకో ఉతుప్ (78) గుండెపోటుతో మరణించారు. సోమవారం రాత్రి కోల్‌కతాలోని నివాసంలో టీవీ చూస్తున్నప్పుడు.. చాకో ఉతుప్‌కు గుండెపోటు వచ్చింది. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. చాకో, ఉషా దంపతులకు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు. Also Read: […]
BCCI Prize Money For 2007 T20 World Cup and 2011 ODI World Cup: టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల నజరానా అందించిన విషయం తెలిసిందే. 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు, కోచ్‌లకు తలో రూ.2.5 కోట్లు, రిజర్వ్ ఆటగాళ్లకు మరియు సెలక్టర్లకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. అయితే 1983, […]