Sampath Kumar
Author- NTV Telugu-
Gold Rate Today: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మార్కు చేరుకుంది. ఆ తర్వాత కొంత మేర తగ్గుతూ వచ్చిన పసిడి.. మళ్లీ పెరుగుతోంది. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. మరలా 98 వేలు దాటాయి. నిన్న తగ్గిన గోల్డ్ రేట్స్ నేడు షాకిచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.490 పెరిగితే .. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.450 పెరిగింది. […] -
YS Jagan: వైఎస్ జగన్ పొదిలి పర్యటన వాయిదా!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది. బుధవారం (మే 28) పొదిలిలో జగన్ పర్యటించాల్సి ఉండగా.. వాయిదా పడిందని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పొదిలి పర్యటన వాయిదా పడినట్లు పేర్కొంది. వాతావరణం అనుకూలించిన తర్వాత వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటన తేదీలను వైసీపీ ఖరారు చేయనుంది. Also Read: CM Chandrababu: అదే నా ఆశ.. ఆకాంక్ష! […] -
CM Chandrababu: అదే నా ఆశ.. ఆకాంక్ష!
నూతన మార్గదర్శకాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలన్నదే తన ఆశ, ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచిందన్నారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. మహానాడు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ‘తెలుగుదేశం మహా పండుగ […] -
Godavari River Tragedy: గోదావరిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు.. ఒక మృతదేహం లభ్యం!
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని లంక వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన 8 మంది యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము వరకు గజ ఈత గాళ్లు, వలల సాయంతో ఎస్డీఆర్ఎఫ్ అధికారులు గోదావరిని జల్లెడ పట్టారు. ప్రమాదం జరిగిన సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం వడ్డే మహేష్‌గా గుర్తించారు. ఇంకా ఏడుగురి యువకుల ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శేరిలంకకు […] -
Mahanadu 2025: నేటి నుంచి టీడీపీ మహానాడు.. ఈరోజటి కార్యక్రమాలు ఇవే!
టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే ‘మహానాడు’ నేటి నుంచి కడప జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప మొత్తం పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పసుపు మయం అయింది. మహానాడులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రానున్నారు. ప్రస్తుతం […] -
Coronavirus: ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. వెయ్యి దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య!
ఏపీలో మహమ్మారి కరోనా వైరస్ కేసుల నమోదు కలకలం రేపుతోంది. తాజాగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లా ఏలూరుకు చెందిన భార్యభర్తలు, తెనాలికి చెందిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యులు వృద్ధుడిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్ పరీక్షలలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. గుంటూరు జిల్లాలో మూడు కేసులు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే విశాఖ, […] -
PBKS vs MI: ముంబైని కొట్టి.. క్వాలిఫయర్ అవకాశాన్ని అందుకున్న పంజాబ్!
పదేళ్ల తర్వాత ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ కింగ్స్.. నేరుగా క్వాలిఫయర్ ఆడే అవకాశాన్నీ ఒడిసిపట్టింది. రెండో దశలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన పంజాబ్.. 19 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుకు ఫైనల్ చేరడానికి క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌కు ఫైనల్ చేరేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. పంజాబ్‌పై ఓడిన ముంబై 16 పాయింట్లతో నాలుగో స్థానానికి […] -
PSL 2025 Final: పీఎస్ఎల్ ఫైనల్ కోసం 6 వేల కిమీ జర్నీ.. ఫ్లైట్ డబ్బులు వృధా కాలే!
జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా పీఎస్ఎల్ 2025 ఫైనల్ కోసం 6 వేల కిలీమీటర్లకు పైగా ప్రయాణించాడు. ప్రయాణం మాత్రమే కాదు.. టైటిల్ గెలవాలడంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ పడటానికి కేవలం పది నిమిషాల ముందు లాహోర్ ఖలందర్స్ జట్టుతో కలిశాడు. అంతకుముందు ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన ఇంగ్లాండ్-జింబాబ్వే టెస్ట్ మ్యాచ్ మూడో రోజు సికందర్ రాజా 68 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ […] -
RK Roja: మహానాడులో తీర్మానం చేసే దమ్ము టీడీపీకి నేతలకు ఉందా?.. ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు!
కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు. రోజుకొకరిపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కూటమి నేతలు చేసిన పనులకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయ్యాక రెడ్ బుక్ […] -
HPSL 2025: ఐపీఎల్ తరహాలో లీగ్.. 8 గుర్రాలు మృతి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో హార్స్ పవర్ స్పోర్ట్స్ లీగ్ (హెచ్పీఎస్ఎల్) నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. హెచ్పీఎస్ఎల్ నిర్వహణకు హైదరాబాద్ బిజినెస్మెన్ సురేష్ పాలడుగు సన్నాహాలు చేశారు. హెచ్పీఎస్ఎల్ కోసం హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లోని సచిన్ తివారీ ఫార్మ్‌కు గుర్రాలను అక్రమంగా తరలించారు. హైదరాబాద్ నుంచి తరలించిన 57 గుర్రాల్లో ఎనమిది జబల్పూర్లో మృతి చెందాయి. మాల్ న్యూట్రిషన్ కారణంగా మృతి చెందినట్టు గుర్తించారు. Also Read: Kakani Govardhan Reddy: కాకాణిని కోర్టులో […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!