Hardik Pandya: బంగ్లా చిన్న జట్టు.. హార్దిక్ విషయంలో అత్యుత్సాహం వద్దు: ఆర్పీ సింగ్
- 6 బంతుల్లో 39 పరుగులు
- 4 ఓవర్లలో 26 రన్స్
- హార్దిక్ ఫామ్‌పై ఆర్పీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా విజయంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో 16 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పేస్ బౌలింగ్‌లో నో బ్యాక్ లుక్ షాట్‌తో హార్దిక్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. ఇక బౌలింగ్‌లో నాలుగు ఓవర్ల కోటాలో ఒక వికెట్ తీసి 26 రన్స్ ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్ ప్రదర్శన ఆదారంగా హార్దిక్ ఫామ్‌ను అంచనా వేయవద్దని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ అంటున్నాడు.
జియో సినిమాలో ఆర్పీ సింగ్ మాట్లాడుతూ… ‘బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టుతో ఆడినప్పుడు ఆటగాడి ప్రదర్శనను జడ్జ్ చేయడం సరైంది కాదని నా అభిప్రాయం. బంగ్లా ఎలా ఆడుతుందో అందరం చూస్తున్నాం. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడం లేదు. ఇక్కడ హార్దిక్ పాండ్యాను తక్కువ చేయడం లేదు. అతడు అత్యుత్తమ ప్లేయర్. గతంలో ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు, ఆడగలడు కూడా. అయితే బంగ్లాపై విభిన్నమైన షాట్లను ఆడడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అసలైన పరీక్ష పటిష్ట జట్టు ఎదురైనప్పుడే ఉంటుంది. ఈజీగా మ్యాచ్ గెలుస్తున్నామని తెలిసినప్పుడు ఓ బ్యాటర్ మరింత స్వేచ్ఛగా షాట్స్ ఆడుతాడు. ఒత్తిడి ఉన్నప్పుడే అసలు ఆట ఏంటో తెలుస్తుంది. బంగ్లా ఏ దశలోనూ టీమిండియాకు సవాల్ విసరలేదు’ అని అన్నాడు.
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
Also Read: IPL 2025-DC: అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు జాక్‌పాట్.. ఢిల్లీ రిటైన్ లిస్ట్ ఇదే!
‘హార్దిక్ పాండ్యా కొట్టిన ఫోర్, సిక్స్ ఇక్కడ విషయం కాదు. హార్దిక్ నాలుగు ఓవర్లు బాగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. గతంలో హార్దిక్ తన పూర్తికోటా ఓవర్లను వేయలేకపోయాడు. ఇప్పుడు అలవోకగా వేస్తున్నాడు. ఇది మనకు గుడ్‌న్యూస్. హార్దిక్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. కానీ రాబోయే సిరీసుల్లోనూ రాణిస్తేనే.. అతడిపై ఓ అంచనాకు వస్తే బాగుంటుంది. హార్దిక్ విషయంలో అత్యుత్సాహం వద్దు’ అని ఆర్పీ సింగ్ వివరించాడు.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?