ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కీలక ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించనుంది.
నేడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడోవరోజు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు.
నేడు శ్రీశైలంలో 8వ రోజు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం మహాగౌరి అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నందివాహనంపై ఆశీనులై ఆది దంపతులు ప్రత్యేక పూజలందుకోనున్నారు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం ఉంటుంది.
నేడు మంగళగిరి లో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలో మంత్రి పాల్గొననున్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఎనమిదవరోజు మహాగౌరి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. దుర్గాష్టమి సందర్భంగా ఉదయం చండీ హోమం, సాయంత్రం మహిషాసుర మర్ధిని అమ్మవారికి మహా పూజ నిర్వహించనున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు ఐశ్వర్యలక్ష్మి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు.