బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. నవంబర్ మొదటి నుంచి క్రమంగా తగ్గుతూ రికార్డు స్థాయిలో దిగొచ్చిన గోల్డ్ రేట్స్.. మరలా పెరుగుతున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.600పెరగగా.. నేడు రూ.700 పెరిగింది. 24 క్యారెట్లపై నిన్న రూ.660 పెరగగా.. నేడు రూ.770 పెరిగింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (నవంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,650గా నమోదవగా.. 24 క్యారెట్ల […]
కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు తరలివస్తున్నారు. దాంతో ప్రతి రోజు ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో మార్మోగుతోంది. 2024 నవంబర్ 9న ఆరంభమైన కోటి దీపోత్సవం.. నవంబర్ 25 వరకు కొనసాగనుంది. ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు కార్యక్రమాలు మొదలవుతాయి. కోటి దీపోత్సవం […]
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్మీ’ తన జీటీ సిరీస్‌లో ‘జీటీ 7 ప్రో’ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనాలో విడుదల అయిన రియల్మీ జీటీ 7 ప్రో.. నవంబర్ 26న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 18 నుంచే ప్రీ-బుకింగ్ మొదలైంది. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో జీటీ 7 ప్రో అమ్మకాలు అందుబాటులో ఉంటాయి. రియల్మీ జీటీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్‌లు సోమవారం […]
దేశవాళీ టోర్నీ ‘సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ’ 2024కి సమయం ఆసన్నమైంది. నవంబర్ 23 నుండి డిసెంబర్ 15 మధ్య ట్రోఫీ జరుగుతుంది. ఈ టోర్నీ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. భారత్, దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచరీలతో చెలరేగిన తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదివరకే హైదరాబాద్ జట్టుకు తిలక్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. 15 […]
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22న ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్ల సిద్దమవుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు వెళ్లాలంటే ఈ సిరీస్ అటు ఆసీస్, ఇటు టీమిండియాకు అత్యంత కీలకం. అందుకే మొదటి టెస్టులోనే గెలిచి సిరీస్‌పై పట్టుసాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. పెర్త్ టెస్ట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానుండగా.. ఆస్ట్రేలియా కూడా […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సిద్దమైంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకున్న ఆర్సీబీ.. కొత్త జట్టు కోసం ప్రణాళికలు రూపొందించింది. వేలంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. భారీ ధర పెట్టైనా రాహుల్‌ను సొంతం చేసుకుని.. జట్టు పగ్గాలు అప్పగించాలనే ప్రణాళికతో ఆర్సీబీ ఉందట. అయితే వేలంకు ముందే సపోర్ట్ స్టాఫ్ విషయంలోనూ ఆర్సీబీ […]
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో సందిగ్థత వీడడం లేదు. ఓవైపు ఆతిథ్యం విషయంలో పాకిస్థాన్ మొండిగా ఉండగా.. మరోవైపు పాక్‌కు వెళ్లి ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదు. టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తేనే పాల్గొంటామని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పగా.. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని పీసీబీని అంతర్జాతీయ క్రికెట్ మండలి కోరింది. ఈ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. సోమవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆధునీకీకరణ పనులను పరిశీలించిన పీసీబీ ఛైర్మన్ మొహసీన్ నఖ్వీ […]
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. వారం కిందటే ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలో వాకా స్టేడియంలో ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్ ఆడింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు, బౌలరర్లు బరిలోకి దిగారు. మూడోరోజు వార్మప్‌కు సంబంధించి వీడియోను బీసీసీఐ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. […]
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఐకూ’ ఇటీవలి రోజుల్లో భారత మార్కెట్లో వరుసగా స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన ‘ఐకూ 13’ను డిసెంబర్ 3న భారతదేశంలో లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఇక ‘నియో 10’ సిరీస్‌ను కూడా త్వరలో విడుదల చేయబోతోంది. చైనాలో నవంబర్ 29న ఐకూ నియో 10 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ఐకూ నియో 10, ఐకూ నియో 10 ప్రోలు రిలీజ్ కానున్నాయి. చైనాలో […]