ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చాక స్మార్ట్ టీవీల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇంట్లోనే బిగ్ స్క్రీన్స్‌లో సినిమాలను వీక్షించే వారి సంఖ్య ప్రస్తుతం పెరుగుతోంది. వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు తక్కువ ధరలో స్మార్ట్ టీవీలను రిలీజ్ చేస్తున్నాయి. అందులోనూ ఇ-కామర్స్ సంస్థలు స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. దాంతో తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ టీవీని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. తాజాగా అమెజాన్‌లో ఓ బెస్ట్ డీల్ ఉంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. […]
పేసర్లు కెప్టెన్లుగా ఉండాలని తాను ఎప్పుడూ చెబుతుంటానని, మైదానంలో వారి ట్రిక్‌లు భిన్నంగా ఉంటాయని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. కపిల్ దేవ్ సహా గతంలో చాలామంది పేసర్లు కెప్టెన్లుగా ఉన్నారని, ఈ కొత్త సంప్రదాయానికి ఇది ప్రారంభం అని తాను ఆశిస్తున్నానన్నారు. కెప్టెన్సీ ఓ గౌరవం అని, తనకు సొంత శైలి ఉందని బుమ్రా చెప్పుకొచ్చాడు. కుమారుడి పుట్టిన కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. […]
క్రికెట్లో టీ20, టీ10 ఫార్మాట్ వచ్చాక పూర్తిగా మారిపోయింది. పొట్టి ఫార్మాట్లో బ్యాటర్లదే హవా నడుస్తోంది. బౌండరీలు, సిక్సుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు నమోదవగా.. తాజాగా ఓ బ్యాటర్ 8 బంతుల్లో 8 సిక్స్‌లు బాదాడు. ఈ ఘటన స్పెయిన్ టీ10 టోర్నీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోంట్జుక్ ఒలింపిక్ గ్రౌండ్లో యునైటెడ్ సీసీ గిరోనా, పాక్ బార్సిలోనా […]
మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో వేలం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీసీసీఐ ఇప్పటికే పూర్తి చేసింది. మెగా వేలానికి 1,574 మంది ప్లేయర్స్ తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు 574 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఈ 574 మందిలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి వేలంలో […]
బెల్జియం సర్రియలిస్ట్ ఆర్టిస్టు ‘రెన్ మార్గిట్’ వేసిన ఓ పెయింటింగ్ వేలంలో రికార్డు ధరను కొల్లగొట్టింది. మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన క్రిస్టీస్ వేలంలో ఏకంగా 121 మిలియన్ డాలర్లు పలికి సంచలనం సృష్టించింది. భారత కరెన్సీలో ఈ ధర రూ.1021 కోట్లు. అధివాస్తవికతను చిత్రించే పెయింటింగ్‌లలో అత్యధిక ధర పలికిన రికార్డును ఇది సొంతం చేసుకుంది. ఈ రికార్డు ధర తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అదే సమయంలో రెనె మాగ్రిట్‌ను ‘మాస్టర్ ఆఫ్ సర్రియలిజం’ అని […]
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన అనంతరం వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. రూ.82 వేల నుంచి రూ.75 వేలకు దిగొచ్చింది. హమ్మయ్య గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయని కొనుగోలుదారులు తెగ సంతోషపడ్డారు. ఆ సంతోషం మూడు రోజుల ముచ్చటే అయింది. పసిడి ధరలు మరలా షాక్ ఇస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు గోల్డ్ రేట్లు పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.330 పెరిగింది. బులియన్ మార్కెట్లో […]
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. వేలానికి 1,574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. 574 మందిలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. వేలంలో ఈసారి టీమిండియా స్టార్స్ ఉండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఎవరు ఎంత ధరకు అమ్ముడవుతారని ఎదురుచూస్తున్నారు. ఈ […]
క్రికెట్ ఆటలో బ్యాటర్లు, బౌలర్లకు గాయాలు అవ్వడం సహజమే. ఒక్కోసారి ఫీల్డ్ అంపైర్లకూ గాయాలు తప్పవు. ఫీల్డర్ బంతిని విసిరినపుడు అంపైర్లకు గాయలవుతుంటాయి. అదే సమయంలో బ్యాటర్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడినపుడు ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాల మీదికి కూడా వస్తుంటుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని దేశవాళీ మ్యాచ్‌కు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన టోనీ డి నోబ్రెగాకు ఇదే పరిస్థితి ఎదురైంది. బ్యాటర్ స్ట్రెయిట్ షాట్ కారణంగా టోనీ ముఖమంతా గాయాలయ్యాయి. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా, […]
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఆరంభానికి సమయం దగ్గరపడింది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుతో సిరీస్ ఆరంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7.50కి పెర్త్ టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. తొలి టెస్టులనే విజయం సాధించి.. సిరీస్‌పై పట్టు సాధించాలని చూస్తున్నాయి. ఈ సిరీస్‌లో రాణించి.. ట్రోఫీతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ […]
2024 కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘కోటి దీపోత్సవం’ విజయవంతంగా కొనసాగుతోంది. రోజుకో కల్యాణం, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలు, వాహనసేవ, పూజలతో భక్తులు పరవశించిపోతున్నారు. దీపాల వెలుగులు, వందలాది భక్తులతో ప్రతిరోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం కళకళలాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ దీపాల పండుగలో పాల్గొని ఈ లోకాన్నే మరిచేలా పునీతులవుతున్నారు. కోటి దీపోత్సవంకు భక్తులతో పాటుగా ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. కోటి దీపోత్సవం 2024కు ముఖ్యఅతిథులుగా తెలంగాణ […]