Jasprit Bumrah: కొత్త సంప్రదాయానికి ఇది ప్రారంభం: బుమ్రా
- పెర్త్ వేదికగా తొలి టెస్ట్
- రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్‌గా బుమ్రా
- తుది జట్టుపై ఓ అంచనాకు వచ్చాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేసర్లు కెప్టెన్లుగా ఉండాలని తాను ఎప్పుడూ చెబుతుంటానని, మైదానంలో వారి ట్రిక్‌లు భిన్నంగా ఉంటాయని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. కపిల్ దేవ్ సహా గతంలో చాలామంది పేసర్లు కెప్టెన్లుగా ఉన్నారని, ఈ కొత్త సంప్రదాయానికి ఇది ప్రారంభం అని తాను ఆశిస్తున్నానన్నారు. కెప్టెన్సీ ఓ గౌరవం అని, తనకు సొంత శైలి ఉందని బుమ్రా చెప్పుకొచ్చాడు. కుమారుడి పుట్టిన కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. రోహిత్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ బుమ్రా.. భారత జట్టును నడిపించనున్నాడు.
ప్రీమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ… ‘కెప్టెన్సీ ఓ గౌరవం. నాకు సొంత శైలి ఉంది. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలు కూడా విభిన్నంగా ఉంటాయి. బాధ్యతలు తీసుకోవడాన్ని నేను ఇష్టపడతాను. నేను గతంలోనే రోహిత్‌తో చాలాసార్లు మాట్లాడాను కానీ.. ఇక్కడికి వచ్చాక నాయకత్వంపై మరింత స్పష్టత వచ్చింది. పేసర్లు కెప్టెన్లుగా ఉండాలని నేను ఎప్పుడూ అంటుంటా. ఎందుకంటే మైదానంలో వారి ట్రిక్‌లు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు పాట్ కమిన్స్ అద్భుతంగా రాణించాడు. గతంలో కపిల్ దేవ్ సహా చాలా మంది సక్సెస్ అయ్యారు. ఈ కొత్త సంప్రదాయానికి ఇది ప్రారంభం అని ఆశిస్తున్నా’ అని అన్నాడు.
Also Read
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
Also Read: 8 Sixes Off 8 Balls: క్రికెట్‌లో సంచలనం.. 8 బంతుల్లో 8 సిక్స్‌లు!
‘ఒక సిరీస్‌లో గెలిచినా, ఓడినా.. తర్వాత సిరీస్‌లో మొదటి నుంచి మొదలుపెట్టాల్సిందే. న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి తాలుకా నిరుత్సాహాన్ని ఆస్ట్రేలియాకు తీసుకురాలేదు. ఆ సిరీస్ నుంచి మేం చాలా అంశాలు నేర్చుకున్నాం. భారత్‌లో విభిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక్కడ మా ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. తుది జట్టుపై ఓ అంచనాకు వచ్చాం. మ్యాచ్ ప్రారంభానికి ముందు డీటెయిల్స్ వెల్లడిస్తాం’ అని జస్ప్రీత్ బుమ్రా చెప్పాడు. ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సిరీస్‌లను గెలుచుకొన్న భారత్.. హ్యాట్రిక్‌పై కన్నేసింది.
తాజావార్తలు
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..