2024 కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘కోటి దీపోత్సవం’ విజయవంతంగా కొనసాగుతోంది. రోజుకో కల్యాణం, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలు, వాహనసేవ, పూజలతో భక్తులు పరవశించిపోతున్నారు. దీపాల వెలుగులు, వందలాది భక్తులతో ప్రతిరోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం కళకళలాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ దీపాల పండుగలో పాల్గొని ఈ లోకాన్నే మరిచేలా పునీతులవుతున్నారు. కోటి దీపోత్సవంకు భక్తులతో పాటుగా ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.
కోటి దీపోత్సవం 2024కు ముఖ్యఅతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి సహా పలువురు రాజకీయ నేతలు, అధికారులు పాల్గొన్నారు.. నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. రాష్ట్రపతి కార్తీక దీపారాధన చేయనున్నారు. ఇందుకోసం భక్తి టీవీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. నేటి కోటి దీపోత్సవంలో ద్రౌపది ముర్ము మాట్లాడనున్నారు. ఇక నేడు కోటి దీపోత్సవంలో 13వ రోజు. నేటి విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం.
Also Read: IPL 2025 Auction: అతడికి ఆల్‌టైమ్ రికార్డు ధర పక్కా.. సురేష్ రైనా జోస్యం!
13వ రోజు విశేష కార్యక్రమాలు ఇవే:
# చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు శ్రీ సి. ఎస్. రంగరాజన్ గారిచే ప్రవచనామృతం
# వేదికపై పూరీ జగన్నాథ హారతి, నృసింహ రక్షా కంకణ పూజ
# భక్తులచే నృసింహ విగ్రహాలకు రక్షా కంకణ పూజ
# యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం
# శేష వాహన సేవ