ఆరు నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత వచ్చిందని, ఇక ఇక ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చిందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. 2025 జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన మొదలువుతుందని, ప్రతి పార్లమెంటులో బుధ, గురువారాల్లో తాను నిద్ర చేస్తాను అని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నానని, వైసీపీ పార్టీ నేతలు ఇప్పటికీ ప్రజల్లోకి సగర్వంగా వెళ్ళచ్చన్నారు. వైసీపీకి గత ఎన్నికల్లో 50 శాతం […]
‘ప్రోబా-3’ మిషన్ విజయవంతమైంది: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ59 వాహక నౌక నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4.04 గంటలకు వాహక నౌక కక్ష్యలోకి ప్రవేశించింది. సాంకేతిక లోపం కారణంగా బుధవారం చేపట్టాల్సిన ప్రయోగం నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రయోగం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ తెలిపారు. ప్రయోగం విజయవంతంతో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ‘రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అనుకున్న […]
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ59 వాహక నౌక నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4.04 గంటలకు వాహక నౌక కక్ష్యలోకి ప్రవేశించింది. సాంకేతిక లోపం కారణంగా బుధవారం చేపట్టాల్సిన ప్రయోగం నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రయోగం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ తెలిపారు. ప్రయోగం విజయవంతంతో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ‘రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అనుకున్న కక్షలోకి ప్రోబా-3 ఉపగ్రహాన్ని […]
గన్నవరం విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ల కలకలం రేపింది. విజయవాడలోని కేయల్ యూనివర్సిటీ నుండి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆర్య అనే విద్యార్థి వద్ద బుల్లెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ వద్ద విద్యార్థి బ్యాగులో రెండు బుల్లెట్లను పోలీసులు గుర్తించారు. విద్యార్థి ఆర్య నుంచి బుల్లెట్లను స్వాధీనం చేసుకుని.. గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. Also Read: MInister Atchannaidu: మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది! […]
మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో మిర్చి యార్డులోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, రానున్న మూడు మాసాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసే విధంగా కార్యచరణ రూపొందించాం అని చెప్పారు. మిర్చి యార్డులోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. గుంటూరు మిర్చి యార్డు ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డుగా రైతులకు సేవలు అందిస్తుందని మంత్రి […]
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రూల్’ గురువారం (డిసెంబర్ 5) రిలీజ్ కానుండగా.. బుధవారం రాత్రే ప్రీమియర్స్ పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్పరాజ్ సౌండ్‌తో థియేటర్స్ మోతెక్కిపోతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు థియేటర్లలో తెగ సందడి చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత బన్నీ సినిమా థియేటర్లో విడుదల అవ్వడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. పుష్ప 2 షోలు పడడంతో ఓటీటీ స్ట్రీమింగ్ […]
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిసేపటి క్రితమే శోభిత మెడలో చై మూడుముళ్లు వేశారు. చై-శోభిత వివాహం బుధవారం రాత్రి 8.15 నిమిషాలకు జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. నాగచైతన్య-శోభిత పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మహేష్ బాబు దంపతులు, రామ్ చరణ్ దంపతులతో పాటు హీరోలు […]
హోండా కార్స్ ఇండియా బుధవారం కొత్త అమేజ్ 2024ను లాంచ్ చేసింది. మూడో తరానికి చెందిన ఈ అమేజ్ ప్రారంభ ధర రూ.8 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. టాప్ వేరియంట్ ధర రూ.10.90 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. కొత్త అమేజ్ డిజైన్, ఫీచర్ల పరంగా పలు మార్పులతో వచ్చింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్)ను ఇందులో ఇచ్చారు. మొదటి తరం మోడల్ ఏప్రిల్ 2013లో మార్కెట్లోకి రాగా.. రెండవ తరం మే 2018లో వచ్చింది. […]
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే, జస్ప్రీత్ బుమ్రా వికెట్స్ పడగొట్టగా.. భారత్ 295 రన్స్ తేడాతో గెలిచింది. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా పింక్ బాల్‌తో డే/నైట్ టెస్ట్ డిసెంబర్ 6 నుంచి మొదలుకాబోతోంది. అయితే ఆస్ట్రేలియాలో మ్యాచ్, అదీనూ పింక్ బాల్ టెస్ట్ కాబట్టి.. మ్యాచ్ టైమ్, […]
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ జోస్యం చెప్పాడు. క్లార్క్ తాజాగా ఓ పోడ్కాస్ట్లో పాల్గొనగా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టాప్ స్కోరర్ ఎవరన్న ప్రశ్నకు విరాట్ పేరు చెప్పాడు. ‘పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోయిన విషయం పక్కన పెడితే.. కోహ్లీ మొదటి గేమ్‌లో సెంచరీ చేయడం నన్ను చాలా భయపెడుతోంది. ఈ సిరీస్‌లో విరాట్ భారీగా పరుగులు చేస్తాడు. […]